• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవార్‌తో మోదీ పొలిటికల్...

పవార్‌తో మోదీ పొలిటికల్ గేమ్.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. సుప్రియా సూలే ఎపిసోడ్ వెనుక అసలు వ్యూహం ఇదే

| డీలిమిటేషన్ బిల్లుపై ఇండియా కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి. శరద్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ), స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే బిల్లుకు సానుకూలంగా స్పందించడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. బిల్లుకు మద్దతిచ్చే పార్టీలపై సంజయ్ రౌత్ విమర్శలు చేయడంతో విపక్ష కూటమిలో విభేదాలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

By - A.N.Kumar
Update: 2026-11-28 06:29 GMT

దేశ రాజకీయాల్లో ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు ఒక అద్భుతమైన పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన కోసం తీసుకొచ్చిన ఈ బిల్లు.. ఇప్పుడు ప్రతిపక్ష ఇండియా కూటమిలో పునర్విభజనకు దారితీసేలా కనిపిస్తోంది. బీజేపీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా ఒక్కటైన విపక్షాలు.. ఇప్పుడు ఈ బిల్లు దెబ్బకు ఎవరి దారి వారు చూసుకుంటున్న తీరు హాట్ టాపిక్ గా మారింది.

నిన్నటి వరకు బీజేపీకి బద్ధ వ్యతిరేకిగా కనిపించిన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ).. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి సానుకూల సంకేతాలు ఇవ్వడం ఢిల్లీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. 1971 జనాభా లెక్కల ప్రకారం 50 శాతం సీట్ల పెంపు.. మరో 25 ఏళ్ల పాటు యథాతథ స్థితి వంటి అంశాలు తమకు నచ్చాయని పవార్ వర్గం పైకి చెబుతున్నా అసలు కథ వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి కేంద్రంతో సఖ్యత అవసరమని పవార్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. దీనికి తోడు పవార్ కుమార్తె సుప్రియా సూలేకు కేంద్ర క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కబోతోందంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తుండటం ఈ వ్యవహారానికి కొత్త మలుపునిచ్చింది.

పవార్ వ్యవహారం నుంచే ఇంకా తేరుకోకముందే తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూడా డీలిమిటేషన్ బిల్లుకు జై కొట్టడం కాంగ్రెస్‌కు మింగుడుపడని అంశంగా మారింది. తమ రాష్ట్ర ప్రయోజనాలకు.. దక్షిణాది సీట్ల వాటాకు భరోసా లభించిందని డీఎంకే ఎంపీల సమావేశంలో తీర్మానించడం గమనార్హం.

ఈ పరిణామాలపై కాంగ్రెస్, శివసేన (యూబీటీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవలే పది మంది ఎమ్మెల్యేల బలం ఉన్న పవార్ పార్టీ కోసం రాజ్యసభ సీటును త్యాగం చేస్తే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ బిల్లుకు మద్దతిచ్చేవారు దేశద్రోహులంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో కూటమిలోని విభేదాలు బహిర్గతమయ్యాయి.

ప్రధాని మోదీ మొండిపట్టుదల ఫలించింది. పార్లమెంట్ ను వాయిదావేయకుండా డీలిమిటేషన్, మహిళా బిల్లులను ఆమోదింపచేయడానికి ఆయన వేచి ఉన్న తీరు.. పార్టీలను ఒప్పించి మెప్పించి ఇప్పుడు బిల్లు కు మద్దతు కూడగట్టడంలో మోడీ సక్సెస్ అయ్యారు. ఇక ఈ వ్యవహారంలో ప్రాంతీయ పార్టీల స్వప్రయోజనాను కాపాడడంతో అవి మద్దతు ఇస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ ఈ డీలిమిటేషన్ ఎపిసోడ్ 2029 ఎన్నికలకు ముందే కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపేలా కనిపిస్తోంది.

Tags:    
  • delimitationbill 
  • indiabloc 
  • congress 
  • sharadpawar 
  • ncp 
  • dmk 

Similar News

కోర్టులు ఇన్ వాల్వ్ అయితేనే ఎమ్మెల్యే అరెస్టా? కలెక్టర్ లైంగిక వేధింపుల కేసులో ఊహించని ట్విస్ట్

2026-11-28 05:52 GMT

నైట్ డ్యూటీలు గుండె ఆకారంలో మార్పులు తెస్తాయా? స్టడీ ఏం చెబుతోందంటే?

2026-11-28 05:22 GMT

జంగ్ సైరన్ మోగించిన హసీనా.. భారత్ నుంచి కాలినడకన ప్రయాణం.. మళ్లీ రణరంగంగా బంగ్లాదేశ్?

2026-11-28 04:31 GMT

కరోనా కంటే భయంకరమైన ఉపద్రవం రాబోతోందా?

2026-11-28 03:58 GMT

కూటమి వర్సెస్ వైసీపీ : సీట్లు పెరిగితే ఎవరికి లాభం ?

2026-11-28 03:48 GMT

జగన్ డెసిషన్...కాంగ్రెస్ కి భారీ షాక్ !

2026-11-28 03:48 GMT

చీపురుపల్లి మీద కన్ను ...బొత్సతో చిన్న శ్రీను డైరెక్ట్ ఫైట్ ?

2026-11-28 03:48 GMT

డీలిమిటేషన్ కోసం ప్రత్యేక కమిషన్...ఈసారి బిల్లు గెలిచేస్తుంది !

2026-11-28 03:48 GMT

యోగి మీద భారీ స్కెచ్...సీఎం గిరీ ఎన్నికల వరకేనా ?

2026-11-28 03:47 GMT

డీలిమిటేషన్... ఏపీ ఎప్పటికీ చిన్న రాష్ట్రంగానేనా ?

2026-11-28 02:41 GMT

రుషికొండ ప్యాలెస్ దశను మార్చేలా కూటమి డెసిషన్

2026-11-28 02:39 GMT

Copyright @2026

Powered by Blink CMS