• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Tamil Nadu >  కోర్టులు ఇన్ వాల్వ్...

కోర్టులు ఇన్ వాల్వ్ అయితేనే ఎమ్మెల్యే అరెస్టా? కలెక్టర్ లైంగిక వేధింపుల కేసులో ఊహించని ట్విస్ట్

| తమిళనాడులో మహిళా ఐఏఎస్‌ అధికారిణిని ఎమ్మెల్యే అరుళ్‌ విఘ్నేష్‌ వేధించారనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఫిర్యాదు చేసినా నెలల పాటు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. మద్రాస్‌ హైకోర్టు అసంతృప్తి, మహిళా కమిషన్‌ జోక్యంతో ప్రత్యేక విచారణ చేపట్టి ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. న్యాయం కోసం కోర్టు జోక్యం తప్పనిసరా అంటూ వ్యవస్థ తీరుపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

By - A.N.Kumar
Update: 2026-11-28 05:52 GMT

మన వ్యవస్థలో కొన్ని అద్భుతాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వాటిలో ఒకటి చట్టం తన పని తాను చేసుకుపోవడం.. కానీ ఈ తన పని తాను చేసుకోవడం అనే ప్రక్రియకు కోర్టుల అక్షింతలు, కమిషన్ల నోటీసులు.. మీడియా హడావుడి వంటి ఇంధనం పడితే తప్ప ఇంజిన్ స్టార్ట్ కాదని తమిళనాడులో జరిగిన తాజా ఎపిసోడ్ మరోసారి నిరూపించింది.

ఒక జిల్లాకు కలెక్టర్‌గా ఉన్న మహిళా ఐఏఎస్ అధికారిణికే లైంగిక వేధింపుల నుంచి రక్షణ కరువై న్యాయం కోసం కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి రావడం చూస్తుంటే.. మన వ్యవస్థలో అధికార బలం ముందు అధికార హోదా కూడా ఎంత చిన్నదిగా మారిపోతుందో ఇట్టే అర్థమవుతుంది. కళ్లకురిచ్చి ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్‌పై వచ్చిన ఆరోపణలు.. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు ఇప్పుడు ఒక సెటైరికల్ సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తున్నాయి.

టీవీకే విజయ్ ప్రభుత్వం కొలువుదీరగానే.. ఎమ్మెల్యే కాగానే మన కొత్త ఎమ్మెల్యే అరుళ్ లో కోరికలు ఎక్కువైపోయాయి.. అధికార ‘దాహం’తో ఊగిపోయాడు. జూలైలోనే వేధింపుల గురించి సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లారట. కానీ మన యంత్రాంగం ఎంతటి సహనశీలి అంటే నెలల తరబడి ఎలాంటి తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేసింది. బహుశా ఆరోపణలు నిజమేనా కాదా అని కాలమే సమాధానం చెబుతుంది అన్న గొప్ప తాత్విక దృక్పథంతోనేమో కావచ్చు మరీ..

చివరకు ఈ నెల 23న ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు అందడం.. ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు కావడం జరిగాయి. అసభ్యకర సందేశాలు.. వేధింపులు.. మద్యం సేవించి కలెక్టర్ అధికారిక నివాసానికి రావడం వంటి ఆరోపణలు ఉన్నా.. మన పోలీసులు మాత్రం ఎప్పటిలాగే విచారణ సాగుతోంది అనే క్లాసిక్ డైలాగ్‌తో సరిపెట్టారు.

అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. విషయం మద్రాస్ హైకోర్టు దాకా వెళ్లడంతో న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి జాతీయ మహిళా కమిషన్ జోక్యం.. రాజకీయ నేతలు స్పందించడం తోడయ్యాయి. అంతే ఒక్కసారిగా నిద్రలేచిన యంత్రాంగంలో కదలిక మొదలైంది.

హైకోర్టు ఆదేశంతో తిరుప్పూర్ జిల్లా ఎస్పీ సృష్టిసింగ్ ప్రత్యేక అధికారిగా రంగంలోకి దిగారు. రెవెన్యూ అధికారుల నుంచి కలెక్టర్ సహాయకుల వరకు అందరినీ విచారించి.. ఫిర్యాదుదారురాలి వాంగ్మూలం నమోదు చేసి.. ఎట్టకేలకు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. కోర్టు జోక్యం చేసుకోకపోతే ఈ స్పీడ్ ఇంతలా ఉండేదా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం.

ఒక మహిళా ఐఏఎస్ అధికారిణికే న్యాయం దక్కడానికి నెలలు పట్టి హైకోర్టు జోక్యం అనివార్యమైతే.. ఇక సామాన్య మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఏ స్థాయిలో స్పందన ఉంటుందో ఊహించుకోవడానికే కాస్త ధైర్యం కావాలి. రాజకీయ పలుకుబడి ఉన్నప్పుడు చట్టం కాస్త సిగ్గు పడుతుందేమోనని అనిపిస్తుంది.

ఒక కలెక్టర్ ను ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తే వ్యవస్థ స్పందించిన తీరు మాత్రం ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. ప్రతి చిన్న విషయానికీ హైకోర్టు తలుపు తట్టాల్సిందేనా? లేక కోర్టులు జోక్యం చేసుకున్నప్పుడే మన యంత్రాంగానికి బాధ్యత గుర్తుకు వస్తుందా? ఈ అద్భుతమైన పనితీరుపై ప్రజలు మాత్రం నవ్వుకోవాలో.. ఏడవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు.

Tags:    
  • tamilnadu 
  • iasofficer 
  • womensecurity 
  • highcourt 

Similar News

సినిమా డైలాగులు వేరు.. అసలు రాజకీయం వేరు సీఎం విజయ్..

2026-11-27 17:14 GMT

తిరుపరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక!

2026-11-27 09:58 GMT

వెలగని దీపం.. రగిలిన వివాదం.. తిరుపరంకుండ్రంలో భక్తుల ఆందోళన.. పోలీసుల రంగప్రవేశం

2026-11-24 17:15 GMT

త్రిష మరో జయలలిత...పోలిక బాగానే ఉంది కానీ ?

2026-11-24 03:46 GMT

జయలలిత బాటలో త్రిష.. సీఎం విజయ్ కు షాకేనా? అసలు వ్యూహమేంటి?

2026-11-23 17:00 GMT

స్టాలిన్ రిస్క్ చేస్తారా...ఊరిస్తున్న కొళత్తూరు

2026-11-22 04:16 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

మెకెదాటు ఎఫెక్ట్‌: కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య క‌య్యం!

2026-11-15 20:29 GMT

హైటెక్ దొంగతనం.. కొత్త జ్యువెలరీ షోరూమ్‌ను టార్గెట్ చేసిన యూట్యూబర్!

2026-11-15 19:28 GMT

Copyright @2026

Powered by Blink CMS