• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మేటర్ సీరియస్... అర్జున...

మేటర్ సీరియస్... అర్జున అవార్డ్ గ్రహీతకు వరకట్న వేధింపులు!

| అవును... దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన సావీటీ బూరాకు అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి.

By - Tupaki Desk
Update: 2025-02-27 11:42 GMT

అత్యంత దారుణమైన ఘటన ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. మాజీ ప్రపంచ ఛాంపియన్, అర్జున అవార్డ్ గ్రహీత, భారత నెంబర్ వన్ బాక్సర్ అయిన సావీటీ బూరాకు ఊహించని సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఆమెకు అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు రావడం చర్చనీయాంశంగా మారింది.

అవును... దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన సావీటీ బూరాకు అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. ఈ సమయంలో... తన భర్త, అత్తింటి వారు తనను వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆసియాడ్ కాంస్య విజేత, కబడ్డీ ఆటగాడు దీపక్ హుడాపై, వరకట్న వేధింపుల కేసు నమోదు అయ్యింది.

కాగా.. సావిటీ బూర – దీపక్ హుడా 2022లో వివాహం చేసుకున్నారు. అయితే.. ఫిబ్రవరి 25న హర్యానాలోని హిసార్ లో దీపక్ హుడా వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని పోలీసులకు సావిటీ ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆమె భర్త దీపక్, అతడి కుటుంబ సభ్యులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. ఈ మేరకు హిసార్ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది!

అయితే... హుడాకు రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. కానీ.. అతను హాజరు కాలేదని.. గాయం కారణంగా గైర్హాజరయ్యారని చెబుతున్నారు. దీంతో.. మెడికల్ సర్టిఫికెట్ సబ్ మిట్ చేశారని.. పోలీసులు వెల్లడించారు.

కాగా... 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొహం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దీపక్ హుడా పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన 2016లో దక్షిణాసియా క్రీడల్లో కబడ్డీలో బంగారు పథకం తో పాటు అంతకంటే ముందు 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్నారు.

ఇదే సమయంలో.. ప్రో కబడ్డి లీగ్ లోనూ పాల్గొన్నారు. అయితే.. ఇటీవల ఇరువురి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య ఘర్షణ జరిగినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీ.ఎన్.ఎస్.లోని సెక్షన్ 85 కింద కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది.

Tags:    
  • Saweetyboora 
  • DeepakHuda 
  • DowryHarassment 
  • BoxingChampion 
  • AsianGamesMedalist 
  • HaryanaPolice 
  • DomesticAbuse 
  • DowryCase 
  • IndianSports 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS