‘నాకు 150 ఏళ్లు జీవించే ఫార్ములా తెలుసు.. నన్ను సీఎం చేస్తే చెబుతా’

తమిళనాడు రాజకీయాల్లో పలు సంచలన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు;

Update: 2025-06-06 15:04 GMT

తమిళనాడు రాజకీయాల్లో పలు సంచలన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించడమే కాకుండా ప్రజలలో ఉత్సుకత కలిగించాయి.

"నేను 150 సంవత్సరాలు జీవించే గోప్యమైన ఫార్ములా తెలుసు. ఇది ఎవరూ ఊహించనిది. ప్రపంచంలో చాలా మందికి తెలియదు. కానీ ఇది పని చేస్తుంది. ఈ ఫార్ములాను నేను మీకు చెబుతాను. కానీ ఒకే ఒక్క షరతుతో... 2026లో మీరు నన్ను తమిళనాడు సీఎం గా చేస్తేనే!" అంటూ ఆయన ప్రకటించారు.

శరత్ కుమార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ఇది నిజంగా ఆయుర్దాయం ప్రకటనేనా? లేక రాజకీయ డైలాగ్ లా?" అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు ఈ ప్రకటనను వినోదంగా తీసుకుంటున్నా, మరికొందరు ఆయన నిజంగానే ఏదైనా సైంటిఫిక్ గుట్టు పట్టుకున్నారా? అనే కోణంలో చూస్తున్నారు.

శరత్ కుమార్ ప్రస్తుతం తన పార్టీ "సమత్తువ మక్కల్ కచ్చి" ద్వారా 2026 ఎన్నికలపై దృష్టి సారించారు. "ఆరోగ్యం, ఆయుష్, జీవన శైలి మార్పులు" అనే అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ "150 ఏళ్లు జీవించే ఫార్ములా" రాజకీయంగా వ్యూహాత్మకంగా ఉపయోగించాలనే అజెండా ఉందా? లేక ఇది ఒక వైరల్ ప్రచార పద్ధతా? అన్నదే ప్రధాన చర్చాంశంగా మారింది.

Tags:    

Similar News