మిస్ గ్రాండ్ ఇండియా 2025 ఫైనల్లో ఏపీ యువతి సంజనా వరద..తన బ్యాక్ గ్రౌండ్ ఇదే

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంజనా వరద (Sanjana Varada) తాజాగా మిస్ గ్రాండ్ ఇండియా 2025 (Miss Grand India 2025) పోటీకి తుది పోటీదారుగా (Finalist) ఎంపికయ్యారు.;

Update: 2025-06-05 08:07 GMT

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంజనా వరద (Sanjana Varada) తాజాగా మిస్ గ్రాండ్ ఇండియా 2025 (Miss Grand India 2025) పోటీకి తుది పోటీదారుగా (Finalist) ఎంపికయ్యారు. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పోటీ దిల్లీలో జూలై 3 నుంచి జూలై 13 వరకు జరుగుతుంది. ఈ పోటీలో దేశవ్యాప్తంగా ఎంపికైన 30 మంది ఫైనలిస్టులు తలపడతారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన వారు థాయ్‌లాండ్‌లో జరగనున్న మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2025 (Miss Grand International 2025) పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజనా, రాష్ట్ర సంస్కృతి, గౌరవం, వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పారు.

సంజనా ప్రస్థానం

ఇది సంజనాకు తొలి విజయం కాదు. సంజనా 2023లో మిస్ టీన్ గ్లోబల్ ఇండియా (Miss Teen Global India) కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత 2024లో మలేషియాలో జరిగిన మిస్ టీన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ (Miss Teen Global International) పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచారు. గతంలో జైపూర్ వంటి ప్రసిద్ధ వేదికలపై కూడా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఆమె అప్పటినుంచి స్థిరంగా ఎదుగుతూ అద్భుతమైన ప్రదర్శనలను అందిస్తూ వస్తున్నారు.

సామాజిక సేవలో సంజనా

సంజనా అందాల పోటీలలోనే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొటారు. పిత ఫౌండేషన్ ద్వారా అనాథలు, దివ్యాంగులకు ఆమె సహాయం అందిస్తున్నారు. ప్రజల పట్ల మానవీయ ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఆమె సామాజిక స్పృహ, సేవానిరతి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

మిస్ గ్రాండ్ ఇండియా 2025లో సంజనా

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీలో వివిధ రౌండ్లు ఉంటాయి. వాటిలో నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ (National Costume), టాలెంట్ రౌండ్, ఈవెనింగ్ గౌన్, ఇంటర్వ్యూ, శారీరక దారుఢ్యం (Fitness) వంటి రౌండ్లు ఉన్నాయి. సంజనాకు ఉన్న సామాజిక అవగాహన, ఆమె వాక్చాతుర్యం, వేదికపై ఆమె ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రదర్శన ఈ అన్ని విభాగాలలోనూ ఆమెను బలమైన పోటీదారుగా నిలుపుతాయని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా, యావత్ భారతదేశం ఈ గొప్ప ప్రయాణంలో ఆమెకు సపోర్టుగా నిలుస్తోంది. థాయ్‌లాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని సంజనా నుంచి భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆమె అందం, తెలివితేటలు, సేవా గుణంతో విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News