రాజ్యసభకు అయ్యన్న వారసుడు

తెలుగుదేశం పార్టీ తమకు దక్కిన మూడు రాజ్యసభ ఎంపీ సీట్లకు గానూ అభ్యర్ధులను ప్రకటించింది.

Update: 2026-06-06 18:36 GMT

తెలుగుదేశం పార్టీ తమకు దక్కిన మూడు రాజ్యసభ ఎంపీ సీట్లకు గానూ అభ్యర్ధులను ప్రకటించింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఆ పార్టీ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్ధుల లిస్ట్ ని తెలియచేసింది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ ని మరోసారి రెన్యూవల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రెండవ సీటుని భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామక్రిష్ణకు, మూడవ సీటుని విశాఖకు చెందిన యువ నాయకుడు చింతకాయల విజయ్ కి కేటాయించారు. దాంతో సుదీర్ఘమైన కసరత్తు తరువాత టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయినట్లు అయింది. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతకంతో ఈ ప్రకటనను రిలీజ్ చేశారు.

చాన్స్ కొట్టేసిన యువ నేత :

ఇదిలా ఉండగా సానా సతీష్ పేరు అంతా ఊహించనదే. రెండవ సీటు విషయంలో కిలారు రాజేష్ భాష్యం రామక్రిష్ణల మధ్యన ఎంపిక విషయంలో ఆసక్తి పెంచిందని ప్రచారం సాగింది. చివరికి భాష్యం రామక్రిష్ణ వైపే అధినాయకత్వం మొగ్గు చూపించింది. మూడవ సీటు విషయంలో మరింత ఆసక్తికరమైన చర్చ సాగింది దానిని సీనియర్ నేత వర్ల రామయ్యకు ఇవ్వాలా లేక ఉత్తరాంధ్రా నుంచి యువ నేతకు ఇవ్వాలా అనేది కూడా తీవ్ర స్థాయిలో తర్జన భర్జన పడిన తరువాత చివరికి అయ్యన్న కుమారుడి వైపుకే అధినాయకత్వం మొగ్గు చూపించింది అని చెబుతున్నారు.

సామాజిక సమీకరణలు :

ఈ మూడు సీట్ల ఎంపికలో టీడీపీ సామాజిక సమీకరణల విషయంలో సమ తూకం పాటించింది అని అంటున్నారు. అలాగే ప్రాంతీయ సమీకరణలను పాటించింది అని అంటున్నారు గోదావరి జిల్లాలలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్ ని ఎంపిక చేశారు. అలాగే కోస్తా జిల్లాలలో కీలకమైన సామాజిక వర్గంగా ఉన్న కమ్మ నుంచి భాష్యం రామక్రిష్ణకు చాన్స్ ఇచ్చారు. ఉత్తరాంధ్రా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత విజయ్ కి అవకాశమిచ్చారు. ఇలా అన్ని రకాలుగా టీడీపీ మధనం చేసి ఈ ఎంపిక చేసింది అని అంటున్నారు.

అయ్యన్న కల తీరింది :

తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా సేవ చేస్తున్న చింతకాయల అయ్యన్నపాత్రుడికి పార్టీ సముచితమైన గౌరవం ఇచ్చింది అని అంటున్నారు. ఈ మధ్యనే ఆయన శ్రీవారికి మొక్కుకుని మరీ వచ్చారు. దానికి ఆయనకు నిండాఇన ఆశీస్సులు లభించాయని అంటున్నారు. అదే విధంగా అయ్యన్న వారసుడికి పార్టీ గుర్తింపు కూడా దక్కింది అని చెబుతున్నారు. యువ నేతగా ఐ టీడీపీ ఇంచార్జిగా లోకేష్ కి సన్నిహితుడిగా ఉన్న విజయ్ రాజకీయం 2026 నుంచి అత్యున్నత చట్ట సభ రాజ్యసభ వేదికగా ప్రారంభం కానుంది అని అంటున్నారు. అంతే కాదు చాలా కాలానికి రాజ్యసభ అవకాశం ఉత్తరాంధ్రాకు దక్కింది అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News