ఆ ఒక్క వీడియోనే లీకైందా?... ఈసీకి సజ్జల సూటి ప్రశ్నలు!

ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రైవేటు వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్స్ లో లీకవ్వడంతో ఈసీ వ్యవహారాన్ని వైసీపీ నేతలు దుబ్బయడుతున్నారు!

Update: 2024-05-23 08:56 GMT

ప్రస్తుతం ఏపీలో మే 13న పోలింగ్ సందర్భంగా జరిగినట్లు చెబుతున్న కొన్ని అవాంఛనీయ ఘటనలపై పెను దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేస్తుంటే... 7 ఘటనలు అని చెప్పి ఒక్కదానికి సంబంధించిన వీడియో మాత్రమే.. అది కూడా కొన్ని నిమిషాలు వదలడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి అని వైసీపీ నేతలు నిలదీస్తున్న పరిస్థితి!

అవును... మాచర్ల పాల్వాయి గేట్‌ ఈవీఎం ధ్వంసం ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రైవేటు వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్స్ లో లీకవ్వడంతో ఈసీ వ్యవహారాన్ని వైసీపీ నేతలు దుబ్బయడుతున్నారు! ఈ సందర్భంగా... వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

మాచర్ల పాల్వాయి గేట్‌ ఈవీఎం ధ్వంసం ఘటనపై జరుగుతున్న రాధాంతం.. ఎన్నికల సంఘం తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు.. లీకైనట్లు చెబుతున్న వీడియోలు.. వెలుగులోకి రాని వ్యవహారాలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కు ఆన్ లైన్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

Read more!

ఇందులో భాగంగా... "మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్‌ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా..? ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్‌ మీడియాలోకి ఎలా వస్తుంది..? వీడియో ప్రామాణికతను తనిఖీ చేయకుండా ఈసీ ఎందుకు అంత తొందరపాటుగా కదిలింది?"

"మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు ఈవీఎంల ధ్వంసాలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా..! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్‌ చేస్తుంది..? ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను.. 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్‌ వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదు..? "

"మరీ ముఖ్యంగా కింద జత చేసిన వీడియోలలో అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ సందర్భాలలో ఎందుకు చర్యలు ప్రారంభించలేదు..? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు..?" అని సజ్జల ప్రశ్నించారు.

4

దీంతో... సజ్జల సంధించిన ప్రశ్నలు సహేతుకంగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి లేవనెత్తిన అంశాలు, సంధించిన ప్రశ్నలపై ఎన్నికల కమిషన్ స్పందిస్తుందా.. లేదా.. అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తిగా మారింది!

Tags:    

Similar News