ఉచ్చు బిగిస్తున్న రుణమాఫీ !

‘’లక్ష కాదు. రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ అయిన వారు కూడా ఒకటి కాదు రెండు లక్షలు రుణం తీసుకోండి.

Update: 2024-04-30 06:23 GMT

‘’లక్ష కాదు. రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ అయిన వారు కూడా ఒకటి కాదు రెండు లక్షలు రుణం తీసుకోండి. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసే బాధ్యత నాది’’ అని శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటనలు చేశాడు. తీరా అధికారంలోకి వచ్చాక అది సాధ్యం కాదని తెలిసిపోయింది. దీంతో విపక్షాలతో పాటు రైతుల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రైతులను దారికి తెచ్చుకునేందుకు దేవుళ్ల మీద ఒట్టుపెట్టి చెప్పినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఇప్పుడు ఏకంగా స్వంత పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి రుణమాఫీ నిరసన సెగ తగిలింది. నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం కన్మనూరులో సొంత పార్టీ కార్యకర్త మహదేవ్‌ మాట్లాడుతూ ‘ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకపోతే 20వ తేదీన ధర్నా చేస్తానని’ హెచ్చరించాడు.

దీనిపై ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి స్పందిస్తూ ‘’సీఎం రేవంత్‌రెడ్డిపై తనకు నమ్మకం ఉంది. ఒకవేళ రుణమాఫీ చేయకపోతే రైతులతో కలిసి నేనే ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తా’’ అని ప్రకటించక తప్పలేదు. ఆగస్టులో రుణమాఫీ చేయలేకపోతే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చేధు అనుభవాలు తప్పేలా లేవు.

Tags:    

Similar News