• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'రుద్ర రచన'.. ఈ అమ్మాయి...

'రుద్ర రచన'.. ఈ అమ్మాయి గురించి తెలిస్తే వావ్ అనేస్తారు

| మంత్రి కేటీఆర్ విపరీతమైన ఆనందానికి గురయ్యారు. 'ఎంత అద్భుతమైన ఆలోచన. చాలా గొప్ప పని చేశావు రచన. నీ ట్వీట్ చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది'

By - Tupaki Desk
Update: 2023-08-15 03:51 GMT

కొన్నిసార్లు గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. భారీ విజయాలు సాధించాల్సిన అవసరం లేదు. మంచి మనసు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకురావటమే కాదు.. వేలాది మందికి కొత్త స్ఫూర్తిగా మారుతుంటుంది. తాజాగా అలాంటి పనే చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది రుద్ర రచన. ఐదారేళ్ల క్రితం సాయం కోసం ఎదురుచూసిన ఆ కళ్లు.. ఇప్పుడు సాయం చేసే స్థాయికి చేరటం ఒక ఎత్తు అయితే.. తాను తీసుకున్న ఫలానికి ప్రతిఫలాన్ని ఇచ్చేయటమే తన లక్ష్యమన్న ఆమె తీరు అందరి చేత ప్రశంసలు పొందేలా చేస్తోంది.

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల్ గ్రామానికి చెందిన రుద్ర రచన తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మరణించారు. తల్లిదండ్రులు లేని ఆమె గురించి తెలిసిన మంత్రి కేటీఆర్ ఆమెకు అండగా నిలవటమే కాదు.. ఆమె బీటెక్ పూర్తి చేసేందుకు సాయం చేశారు. అప్పట్లో ఆమె విద్యాభాస్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందుకున్న రుద్ర రచన.. తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీటెక్ పూర్తి చేసింది.

సొంత కష్టంగా ఉద్యోగాన్ని సాధించింది. అక్కడితో ఆగని ఆమె.. తాజాగా తాను సంపాదించిన జీతంతో రూ.లక్ష మొత్తాన్ని పొదుపు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతుగా విరాళాన్ని పంపింది. అక్కడితో ఆగని ఆమె.. ఒక ట్వీట్ చేసింది. తల్లిదండ్రులు లేని తనకు మంత్రి కేటీఆర్ అంగా నిలిచి.. బీటెక్ పూర్తి అయ్యేలా చేశారని పేర్కొంటూ.. 'ఇటీవల ఉద్యోగాన్ని సంపాదించా. నా జీతంగా వచ్చిన దాన్లో రూ.లక్షను సీఎం సహాయ నిధికి అందించా. మంత్రి కేటీఆర్ చేసిన సాయాన్ని ఎప్పటికి మరవలేను' అంటూ ట్వీట్ చేసింది.

దీని గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ విపరీతమైన ఆనందానికి గురయ్యారు. 'ఎంత అద్భుతమైన ఆలోచన. చాలా గొప్ప పని చేశావు రచన. నీ ట్వీట్ చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది' అంటూ తన భావోద్వేగాన్ని ప్రదర్శిస్తూ.. గతంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందుకున్న రచన ఫోటోతో పాటు.. తనకు రాఖీ సందర్భంగా కట్టిన ఫోటోను.. తాజాగా సీఎం సహాయ నిధికి పంపిన రూ.లక్షచెక్ ను పోస్టు చేశారు.

సాయం పొందటం అందరూ చేస్తారు. కానీ.. తీసుకున్న సాయాన్ని తిరిగి ఇచ్చేసేందుకు సిద్ధమయ్యే రుద్ర రచన వారు మాత్రం ఎందరికో స్ఫూర్తిగా నిలవటమే కాదు.. మరెందరికో సాయం అందించాలన్న భావన కలిగేలా పలువురికి కలిగేలా చేస్తారని మాత్రం చెప్పక తప్పదు. శభాష్ రుద్ర రచన.

Tags:    
  • Telangana 
  • Jagtial 
  • Rudrarachana 
  • Ktr 
  • Btech 
  • Education 
  • Donate 
  • Cm 
  • Relieffund 
  • Socialmedia 
  • Twitter 

Similar News

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

Copyright @2026

Powered by Blink CMS