అదేంది రోజా? సామాజిక వర్గం పవన్ కు గుత్త సొత్తా?

రోజా మాటలతో ఇంతకాలం పవన్ సామాజికవర్గమైన కాపులు అంతా ఆయనతోనే ఉన్నారన్నట్లుగా మాట్లాడం సరికాదు.

Update: 2023-09-18 04:09 GMT

పవన్ కల్యాణ్ పై మాటలతో నిప్పులు కురిపించారు మంత్రి ఆర్కే రోజా. ప్యాకేజీ కోసం కన్నతల్లిని దుర్భాషలాడిన వ్యక్తుల దగ్గర పవన్ బానిసలా బతుకుతున్నారన్న ఆమె.. అవీనీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటమా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న వైనం చూస్తే..నమ్మకున్న సొంత కార్యకర్తల్ని అమ్మేసిన పవన్ తీరును తప్పు పట్టారు.

రోజా ఆగ్రహం బాగానే ఉన్నా.. ఆవేశంలో అనకూడని మాటల్ని అనేయటం ఇబ్బందికరంగా మారింది.

చంద్రబాబుతో పొత్తుపై సొంత కార్యకర్తలు.. పార్టీ నేతల గురించి ఆమె ఎన్ని అన్నా ఓకే. కానీ.. ''సొంత సామాజిక వర్గాన్ని అమ్మేశారు'' అంటూ పవన్ పై చేసిన వ్యాఖ్యలు సరికావంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. రోజా మాటలతో ఇంతకాలం పవన్ సామాజికవర్గమైన కాపులు అంతా ఆయనతోనే ఉన్నారన్నట్లుగా మాట్లాడం సరికాదు.

కాపు సామాజిక వర్గాన్ని తక్కువ చేసేలా మాట్లాడటం రోజాకు సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ వెంట కాపు సామాజికక వర్గం మొత్తం ఉన్న పక్షంలో అంబటి రాంబాబు లాంటి వారు వైసీపీలో ఎందుకు ఉంటారు.

Read more!

కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ తో ఉన్నట్లయితే.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లాంటి వారి సంగతేంటి? ఇలాంటి మాటలతో కాపుల్ని చులకన చేసేలా రోజా మాట్లాడినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దేశ చరిత్రలో పవన్ లాంటి సిగ్గులేని రాజకీయనాయకుడ్ని ఎవరూ చూసి ఉండరన్న రోజా.. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఢీ కొట్టి ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి జగన్ తనను తాను నిరూపించుకున్నారని.. పవన్ మాత్రం పార్టీ పెట్టి దశాబ్దం గడిచినా ఇప్పటికి అందరి జెండాలు మోసే కూలీగా మిగిలిపోయారన్నారు. జనసేన పార్టీ పోటీ చేసిన 136 స్థానాల్లో 120 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. పవన్ స్తాయికి తగ్గట్లు మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.

''అసలు నువ్వు ఒక్క దానిలో అయినా సక్సెస్ అయ్యావా? చదువులో, ఫ్యామిలీలో.. కొడుకుగా.. భర్తగా.. రాజకీయనాయకుడిగా అన్నింట్లో ఫెయిల్యూర్. త్వరలోనే ఆరోగ్య శ్రీ కింద నీ పిచ్చి కుదురుస్తాం'' అని మండిపడ్డారు. అన్నింట్లోనూ ఫెయిల్యూర్ అన్న రోజా మాటలు అతకని రీతిలోఉన్నాయంటున్నారు. కారణం.. సినిమాల్లోఆయన ఎంత సక్సెస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొడుకుగా పవన్ ఫెయిల్ అయ్యారనటానికి ఎక్కడా ఆధారాల్లేవు. ఆవేశంతో అనవసరమైన ప్రస్తావనలు తీసుకొచ్చిన రోజా అదే పనిగా బుక్ అవుతున్నారన్న మండిపాటు వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News