వైసీపీ ఫైర్ బ్రాండ్‌ సేఫ్‌: బాబు సైలెంట్‌.. !

ప్ర‌స్తుతం జైలుకువెళ్లిన వారివ‌ల్ల‌.. బ‌య‌ట‌కు వ‌చ్చిన వారి వ‌ల్ల‌.. అనుస‌రించిన విధానాల‌ను కూడా అధ్య యనం చేశారు.;

Update: 2025-08-28 02:30 GMT

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. మాజీ మంత్రి ఆర్కే రోజా సేఫ‌య్యారా? .. ఆమ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల ని ముందుగా భావించిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు ఒత్తిడి చేస్తున్న‌ప్ప‌టికీ.. సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌ని ఆపేశారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదయ్యా యి. చాలా మంది జైలుకు కూడా వెళ్లారు. అయితే.. ఇలా జైలుకు పంపించిన వారి వ‌ల్ల ప్ర‌యోజ‌నం, న‌ష్టం అనే రెండు కోణాల్లోనూ చంద్ర‌బాబు ఆలోచ‌న చేస్తున్నారు.

ప్ర‌స్తుతం జైలుకువెళ్లిన వారివ‌ల్ల‌.. బ‌య‌ట‌కు వ‌చ్చిన వారి వ‌ల్ల‌.. అనుస‌రించిన విధానాల‌ను కూడా అధ్య యనం చేశారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు.. కొత్త‌గా న‌మోదు చేసే కేసుల విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ రించాల‌ని నిర్ణ‌యించారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేయాల‌ని అనుకుంటే.. ఇబ్బందులు వ‌స్తాయ ని భావిస్తున్నారు. మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వంగా పేరు తెచ్చుకుంటున్న క్ర‌మంలో ఇప్పుడు రోజా పై చ‌ర్య‌లు తీసుకుని జైలుకు పంపించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం క‌న్నా ఇబ్బంది ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

గ‌తంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆధ్వ‌ర్యంలో జాతీయ అసెంబ్లీ పేరుతో మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధు ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. దీనికి రోజాను రాకుండా అడ్డుకున్నారు. ఇది అప్ప‌ట్లో ఆమెకు ప్ల‌స్‌, ప్ర‌భు త్వానికి మైన‌స్ అయింది. ఈ ప‌రిణామాల‌తో ఆమె గ్రాఫ్ పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న చంద్ర‌బా బు ప్ర‌స్తుతం రోజాపై ఎలాంటి చ‌ర్య‌లు వ‌ద్ద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అన‌వ‌స‌రంగా ఆ మెపై కేసు న‌మోదు చేసిన‌ట్టు అవుతుంద‌ని.. దీనివ‌ల్ల ఎవ‌రికీ ఎలాంటి మేలు జ‌ర‌గ‌ద‌ని కూడా భావిస్తున్నారు.

ఏంటీ కేసు..

రోజా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆడుదాం.. ఆంధ్ర పేరుతో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించా రు. ఈ క్ర‌మంలో యువ క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు ఆట‌ప‌రిక‌రాలను పంపిణీ చేశారు. ఈనేప‌థ్యం లో నాణ్య‌త‌లేని ఆట వ‌స్తువులు కొనుగోలు చేసి.. 1.7 కోట్ల రూపాయ‌ల న‌ష్టం క‌లిగించార‌న్న‌ది ఆమెపై ఉన్న అభియోగం. అయితే.. వాస్త‌వానికి ఈ కేసును నెత్తిన వేసుకుంటే.. విమ‌ర్శ‌లు త‌ప్ప‌.. వ‌చ్చేది ఏదీ లేద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. పైగా.. దీనికి సంబంధించి జ‌రిగిన విచార‌ణ‌, అందిన నివేదిక‌లో మంత్రి ప్ర‌మేయం త‌క్కువ‌గా ఉన్న‌ట్టు తెలిసింది. దీంతో రోజావిష‌యంలో సీఎం సైలెంట్ అయిన‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News