• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈ క్రికెటర్లకు రతన్...

ఈ క్రికెటర్లకు రతన్ టాటాకు ఉన్న బంధం ఇదే... రోహిత్ ఇంట్రస్టింగ్ పోస్ట్!

| క్రీడాకారులకు కూడా రతన్ టాటా ఎంతో మద్దతుగా నిలిచారు. టాటా ట్రస్టు, టాటా సంస్థల ద్వారా పలువురు క్రికెటర్లకు ఆయన ఎంతో సాయం అందించారు.

By - Tupaki Desk
Update: 2024-10-11 04:30 GMT

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అక్టోబర్ 9 రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ముంబై లోని ఆసుపత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో అక్టోబర్ 10 సాయంత్రం మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో హిందూ సంప్రదాయంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా దేశం మొత్తం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది.

ఈ సందర్భంగా దేశానికి ఆయా రంగాల్లో రతన్ జీ చేసిన సేవలను ప్రజలంతా కొనియాడారు.. మూగజీవాలపై ఆయన చూపిన ప్రేమను గుర్తుచేసుకున్నారు.. ఆయన దాతృత్వాన్ని స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో క్రీడారంగంలోనూ ఆయన చేసిన సేవలు, పలువురు క్రీడాకారులకు ఆయన ఎంతో మద్దతుగా నిలిచిన విషయాలు తెరపైకి వచ్చాయి.

అవును... వ్యాపార రంగంలోనే కాకుండా.. క్రీడాకారులకు కూడా రతన్ టాటా ఎంతో మద్దతుగా నిలిచారు. టాటా ట్రస్టు, టాటా సంస్థల ద్వారా పలువురు క్రికెటర్లకు ఆయన ఎంతో సాయం అందించారు. ఈ జాబితాలో మాజీలతో పాటు యంగ్ ప్లేయర్లూ ఉన్నారు. వారికి ఆర్థికంగా అండగా నిలవడంకోసం తమ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చేవారు.

ఈ జాబితాలో అలనాటి క్రికెటర్లు మొహిందర్ అమర్నాథ్, ఫరూఖ్ ఇంజినీర్ కూడా ఉండగా... బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఉన్నారు. ఇదే క్రమంలో... జవgaల్ శ్రీనాథ్, మహమద్ కైఫ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, సంజయ్ మజ్రేకర్ లకు తమ గ్రూపులో ఉద్యోగాలు కల్పించారు రతన్ టాటా.

వీరితో పాటు జయంత్ యాదవ్, శార్థూల్ ఠాకూర్ కూడా టాటా గ్రూప్ నుంచి సాయం అందుకున్నవారే. ఈ విధంగా పలువురు క్రికెటర్లకు తమ గ్రూపులో ఉద్యోగాలు కల్పిస్తూ.. స్పాన్సర్ చేస్తూ వెన్నంటి ఉండి ప్రోత్సహించారు.

ఇలా క్రికెటర్లకు పర్సనల్ గా సాయం చేయడమే కాకుండా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను టాటా స్పాన్సర్ షిప్ చేస్తోంది. వివోతో బీసీసీఐ వివాదం వేళ టాటా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా టైటిల్ స్పాన్సర్ గా 4 ఏళ్ల కాలానికి రూ.2,500 కోట్లతో డీల్ చేసుకుంది. ఇదే క్రమంలో మహిళల ప్రీమియర్ లీగ్ ను కూడా టాటానే స్పాన్సర్ చేస్తోంది.

అలా క్రికెట్ రంగానికి, బీసీసీఐ కు తోడుగా నిలిచిన రతన్ టాటా కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా రతన్ జీ ని “బంగారు మనసు కలిగిన మారాజు” అని సంబోధించిన రోహిత్ శర్మ... 'సర్ మీ సెవలను ఎప్పటికీ మరిచిపోలేం.. భారతీయులకు మెరుగైన జీవనం కోసం నిరంతరం శ్రమించారు.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి ఆశిస్తున్నాను" అని పోస్ట్ పెట్టాడు.

Tags:    
  • Rohitsharma 
  • Ratantata 
  • Tatatrusts 
  • Tatagroup 
  • Ajithagarkar 
  • Yuvrajsingh 
  • Cricketers 
  • Tataipl 
  • Ratantatanews 
  • Rohitonratantata 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS