రాబర్ట్ వాద్రాతో కలిపి టోటల్ ఫ్యామిలీ పార్లమెంట్ లోకి !
ఆయన తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్లుగా చెప్పేశారు.;
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అల్లుడు ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, అగ్ర నేత రాహుల్ గాంధీ బావ అయిన రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లుగా ఆయన సూటిగా స్పష్టంగా చెప్పేశారు.
పైగా తనను కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులు రాజకీయంగా లాగుతున్నారని ఆయన మరో సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతీకార రాజకీయాలు సాగుతున్న నేపథ్యంలో తాను రాజకీయాల్లో ఉంటూనే ఎదుర్కోవడం మంచిది అని ఆయన అంటున్నారు. ఆయన తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్లుగా చెప్పేశారు.
నిజం చెప్పాలీ అంటే ప్రియాంకా గాంధీని రాజకీయాల్లోకి రమ్మని తానే కోరాను అని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ లో మరిన్ని గొంతులు కావాలని ఆయన అంటూ ఆ కొత్త గొంతుకను తాను అవుతాను అని అంటున్నారు. నాకు రాజకీయాలు కొత్త కానే కాదని ఆయన అన్నారు. తాను గాంధీ కుటుంబం సభ్యుడిని అని చెప్పారు.
ఇక రాజకీయంగా తన పేరుని ఎన్నికల్లో కొన్ని పార్టీలు ఉపగ్యించుకుంటూ తనను బయటకు లాగుతున్నాయని ఆయన అంటున్నారు. ఇక రాజకీయాల్లో రాహుల్ ప్రియాంక సమర్థంగా పనిచేస్తున్నారు అని ఆయన మెచ్చుకున్నారు పార్లమెంట్ లో ఆ ఇద్దరూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారని అన్నారు.
రాహుల్ ప్రియాంక సహా గాంధీ కుటుంబం నుంచి తాను ఎంతో నేర్చుకున్నాను అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కనుక తనను రాజకీయాల్లోకి రావాలని కోరితే తప్పకుండా వస్తాను అని ఆయన చెప్పేశారు. ఇక చూస్తే ఆయన బీజేపీ నాయకత్వంలోని ఎండీయే ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ వంటి ఆర్థిక మోసగాళ్లను దేశానికి రప్పించాలని వారి నుంచి దేశం కోల్పోయిన ధనాన్ని తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే తప్ప ఇతర ఆలోచనలు ఎందుకని ప్రశ్నించారు.
ఇక పోతే రాబర్ట్ వాద్రా 2024 ఎన్నికల్లోనే పోటీ చేస్తారు అన్న వార్తలు వినిపించాయి. కానీ ప్రియాంకా గాంధీ పోటీతో ఆయన వెనక్కి తగ్గారు. కానీ 2029లో మాత్రం కచ్చితంగా బరిలోకి దిగుతారు అని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో అమేధీ సీటు గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంటుంది. ఆ సీటులో ఈసారి కాంగ్రెస్ కి చెందిన ఒక నాయకుడిని పోటీకి పెట్టారు. ఆయనను ఎంపీగా చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఆ సీటు నుంచి బహుశా రాబర్ట్ వాద్రా పోటీ చేయవచ్చు అని అంటున్నారు.
ఇక కాంగ్రెస్ లో సోనియాగాంధీ రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. కుమార్తె కుమారుడు లోక్ సభలో ఎంపీలుగా ఉన్నారు. రాబర్ట్ వాద్రా కూడా ఎంపీ అయితే టోట్ల ఫ్యామిలీ పార్లమెంట్ లో ఉన్నట్లు అవుతుంది అని అంటున్నారు. వారసత్వ రాజకీయాలు అన్న విమర్శలను కాంగ్రెస్ ఎపుడూ పట్టించుకోలేదు. పైగా కాంగ్రెస్ అంటేనే గాంధీ కుటుంబం కాబట్టి రాబర్ట్ వాద్రాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ ఎక్కువగానే ఉంది. అందుకే ఆయన మీడియా ముందుకు వచ్చి తన మనసులో మాటలను చెప్పారని అంటున్నారు.