ఎస్పీ ఎంపీతో రింకు సింగ్ వివాహం... ఎవరీ ప్రియా సరోజ్?

ఇండియన్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో క్రికెటర్ రింకు సింగ్ వివాహ తేదీ కన్ ఫాం అయ్యిందని తెలుస్తోంది;

Update: 2025-06-01 15:30 GMT

ఇండియన్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో క్రికెటర్ రింకు సింగ్ వివాహ తేదీ కన్ ఫాం అయ్యిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. జూన్ 8న వీరి నిశ్చితార్ధం లక్నోలోని ఓ హోటల్ లో జరగనుండగా.. నవంబర్ 18న వీరిరువురూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు!

అవును... క్రికెటర్ రింకు సింగ్ బ్యాచిలర్ లైఫ్ కు త్వరలో బై బై చెప్పనున్నారు. ఇందులో భాగంగా... సమాజ్ వాదీ పార్టీ ఎంపీతో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక.. రింకూకి కాబోయే భార్య 26 ఏళ్ల ప్రియా సరోజ్.. 2024 లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ టికెట్ పై మచ్లిషహర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.

ఇక.. 1998 నవంబర్ 23న వారణాసిలో జన్మించిన ప్రియా సరోజ్.. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇనిస్టిట్యూట్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ లో డిగ్రీ పట్టభద్రురాలయ్యారు. అనంతరం.. నొయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి. పట్టా పోంది.. కొంతకాలం సుప్రీంకోర్టు న్యాయవాదిగానూ పనిచేశారు.

ప్రియా సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సమాజ్ వాదీ పార్టీ టిక్కెట్ పై కెరాకట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇక.. 1997 అక్టోబర్ 12న ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో జన్మించిన రింకు సింగ్.. కేవలం పాఠశాల విద్యను మాత్రమే అభ్యసించాడు. ఈ క్రమంలో 9వ తరగతి ఫెయిల్ అయ్యాడు. అతని తండ్రి గ్యాస్ సిలిండర్ డెలివరీ పని చేయగా.. అతని సోదరుడు ఆటో రిక్షా నడుపుతూ ఉండేవాడు. రింకూకు ఐదుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.

ఈ క్రమంలో.. ఉత్తరప్రదేశ్ అండర్-16 నుంచి రంజీ జట్టుకు ఎంపికైన రింకు.. 2017లో ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో 2018లో కోల్ కతా నైట్ రైడర్స్ అతనిని రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో వరుసగా 5 సిక్సర్లు కొట్టడంతో రింకూకు మంచి గుర్తింపు వచ్చింది. 2023 ఆగస్టు 18న రింకూ భారత్ తరుపున టీ20 అరంగేట్రం చేశాడు.

Tags:    

Similar News