పహాల్గాం దాడిపై వర్మ కన్ను!
పహాల్గాం ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పాకిస్తాన్ ఉగ్రమూకలు పాశవిక చర్యను ప్రపంచం ముక్త కంఠగా ఖండించింది.;
పహాల్గాం ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పాకిస్తాన్ ఉగ్రమూకలు పాశవిక చర్యను ప్రపంచం ముక్త కంఠగా ఖండించింది. 27 మంది భారతీయుల్ని పొట్టనబెట్టుకున్న ఉగ్ర మూకలను ఏరి పారేయాలని ప్రతీకార చర్యకు రంగం సిద్దమవుతుంది. ప్రతిగా పాకిస్తాన్ కూడా వార్ సైరెన్ మోగించిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్దం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెల కొన్నాయి.
తాజాగా పహాల్గాం ఘటనపై సంచలనాల రాంగోపాల్ వర్మ కన్ను పడినట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీకైంది. పహాల్గాం ఘటనను సినిమాగా తీయాలని వర్మ ఆలోచన చేస్తున్నాడుట. ఇలాంటి ఘనటనల విష యంలో వర్మ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఉగ్రదాడులపై సినిమాలు తీయ డంలో వర్మ మాస్టర్. 26-11 ముంబై ఎటాక్ నేపథ్యంలో అప్పట్లో చేసిన చిత్రం ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అందించిందో తెలిసిందే.
వర్మ పనితనానికి థియేటర్లో స్టాండింగ్ ఓవియేషన్ వచ్చింది. అందులో ప్రతీ ప్రేమ్ ను ఎంతో అద్భు తంగా చెక్కాడు. ఇలాంటి ఘటనలపై సినిమాలు తీయాలంటే అది వర్మకు మాత్రమే చెల్లుతుందని ఆ సినిమాతో మరోసారి రుజువు చేసాడు. వాస్తవానికి వర్మ అప్పటికే వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో ముంబై బ్లాస్ట్ లపై సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం కూడా వర్మ ప్లాప్ ల్లో ఉన్నాడు.
ఈసారి ఆయన కథా వస్తువగా పహాల్గాం ఘటన అవుతుంది. ఘటన విషయంలో వర్మ రీసెర్చ్ ఎలా ఉంటు దన్నది చెప్పాల్సిన పనిలేదు. స్పాట్ ని పరిశీలిస్తున్నాడు. ఘటన జరిగిన తీరును ఆరా తీస్తాడు. బాధిత కుటుంబీకుల్ని కలిసి వాళ్ల ఎమోషన్ క్యాప్చర్ చేస్తాడు. ఇలా పిన్ టూ పిన్ జాగ్రత్త పడతాడు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వర్మ ఇప్పుడే ఆ ఛాన్స్ తీసుకోడు. దేశంలో కొన్ని ఆంక్షలు అమలు లో ఉన్నాయి. శాంతి భద్రతలన్నీ అదుపులోకి వచ్చాక వర్మ ఎనాలసిస్ మొద లయ్యే అవకాశం ఉంది.