• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కొత్త లుక్ తో సీఎం రేవంత్

కొత్త లుక్ తో సీఎం రేవంత్

| ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైట్ షర్ట్ కే పరిమితమైన ఆయన.. తాజాగా గ్రే కలర్ షర్టు ధరించటం ద్వారా కాస్త భిన్నమైన లుక్ లో కనిపించారు .

By - Tupaki Desk
Update: 2023-12-27 06:14 GMT

మరక మంచిదే అన్న యాడ్ మాదిరే.. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి.. మార్పు కూడా మంచిదే. ఎప్పుడూ ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంటుంది. కాస్తంత మార్పుతోనే బోలెడన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటిది పరిస్థితే ఇప్పుడు తెలంగాణలోని రేవంత్ సర్కారులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆడంబరం ఎక్కువగా కనిపించేది. అందుకు భిన్నంగా రేవంత్ సర్కారు తీరు ఉంది. ఏదైనా భారీగా చేయటం కేసీఆర్ అలవాటైతే.. సింఫుల్ గా ఉండటం రేవంత్ స్టైల్.

అందరికి అందుబాటులో.. నిత్యం చైతన్యమన్న రీతిలో రేవంత్ తీరు ఉంటే.. రోజుల తరబడి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు కనిపించే వారు కాదు. ఆయన ఫాంహౌస్ లో ఉన్నారో.. ప్రగతిభవన్ లో ఉన్నారో కూడా తెలీదు. అసలు ఆయన ఏం చేస్తున్నారో కూడా చాలా వరకు అర్థం కాని పరిస్థితి. చివరకు జర్నలిస్టులకు సైతం (ముఖ్యమంత్రి వ్యవహారాలు చూసే జర్నలిస్టులు ) ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆయన డైలీ యాక్టివిటీస్ ఏమిటి? అన్న విషయానికి వస్తే.. సమాధానం క్వశ్చన్ మార్క్ మాత్రమే మిగిలేది.

ఇదిలా ఉంటే.. సీఎం పదవిని చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి తీరే మారినట్లుగా చెప్పాలి. విపక్షంలో ఉన్నప్పటి నుంచి మిగిలిన రాజకీయ నేతలకు కాస్తంత భిన్నంగా రేవంత్ నిలిచేవారు. వైట్ షర్ట్స్ ను ఎక్కువగా ధరించే ఆయన.. సెలవుల్లోనూ.. ఇతర సందర్భాల్లో జీన్స్.. టీషర్టు వేసుకుంటూ యంగ్ గా కనిపిస్తుంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైట్ షర్ట్ కే పరిమితమైన ఆయన.. తాజాగా గ్రే కలర్ షర్టు ధరించటం ద్వారా కాస్త భిన్నమైన లుక్ లో కనిపించారు .

ఈ కొత్త స్టైల్ బాగుందని.. వైట్ షర్ట్ కే పరిమితం కాకుండా.. ఎంపిక చేసిన కొన్ని లేత రంగుల్ని ధరిస్తు మరింత బాగుంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఖద్దరు వస్త్రాల్ని ధరిస్తున్నా.. కొన్ని సందర్భాల్లో మాత్రం రోటీన్ గా తనకు అలవాటైన వస్త్రాల్ని ధరిస్తున్నారు. కొత్త స్టైల్ వస్త్రాలు ఆయన్ను స్టైలీష్ గా చూపించటంతో పాటు.. హుందాగా ఉండేలా చూపిస్తున్నట్లు చెబుతున్నారు. రేవంత్ ఫిజిక్ కు టక్ చేసుకుంటే మరింత బాగుంటుందని.. ఆ రీతిలో కూడా రెఢీ కావాలని కోరుతున్నారు. మరి.. తన ఫారిన్ ట్రిప్పుల్లో రేవంత్ టక్ చేసుకొని.. కోట్ ధరించే లుక్ కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి.. వారి ఆకాంక్షను ఎప్పుడు తీరుస్తారో చూడాలి.

Tags:    
  • Telangana 
  • Politicalnews 
  • Revanthreddy 
  • Newlook 
  • Cheifminister 
  • Government 
  • Congressparty 

Similar News

విశాఖకు అమిత్ షా చంద్రబాబు...మరోసారి అంతర్జాతీయ వేదికగా !

2026-11-08 04:43 GMT

కేటీఆర్ గడ్డం మీద రేవంత్ సెటైర్లు !

2026-11-08 04:43 GMT

ధర్మాన బ్రదర్స్ లెక్క తేడా కొట్టిందా ?

2026-11-08 04:42 GMT

ఎంపీగా గెలిచి.... జెడ్పీటీసీగా ఓడి....ఎందుకలా ?

2026-11-08 03:07 GMT

అక్కడ కూటమి క్లీన్ స్వీప్...వైసీపీ ఎక్కడ ?

2026-11-08 03:05 GMT

ఎమ్మెల్యే కళా వెంకటరావు ఆశలు గల్లంతు.. షాక్ ఇచ్చిన బొత్స

2026-11-08 03:05 GMT

సాయిరెడ్డి కొత్త పార్టీ: ఎవరికి ఎంతెంత ఎఫెక్ట్‌?

2026-11-08 03:05 GMT

కేటీఆర్‌ను మాస్ ర్యాగింగ్ చేసిన సీఎం రేవంత్‌.. విష‌యం ఏంటంటే!

2026-11-08 03:03 GMT

ఎంపీటీసీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు: ఒకరిపై ఒకరు పోటీ పడి గెలిచిన రక్తసంబంధీకులు!

2026-11-08 03:01 GMT

బొత్స కోటలో చిన్న శ్రీను మార్చిన సీన్

2026-11-08 03:00 GMT

బొత్స ఇంట్లో అనూహ్య ఫలితాలు.. కోడలు విజయం, కూతురు ఓటమి

2026-11-08 03:00 GMT

దమ్ము చూపిన జక్కంపూడి రాజా.. స్టేట్ లోనే రికార్డు

2026-11-07 14:12 GMT

Copyright @2026

Powered by Blink CMS