• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  “కమ్మ అంటే అమ్మలాంటి...

“కమ్మ అంటే అమ్మలాంటి వారు”... రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

| "కమ్మ అంటే అమ్మలాంటి వారు. అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది.. కమ్మవారు వ్యవసాయం చేసి పదిమందికీ అన్నం పెడుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-07-20 09:16 GMT

"కమ్మ అంటే అమ్మలాంటి వారు. అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది.. కమ్మవారు వ్యవసాయం చేసి పదిమందికీ అన్నం పెడుతున్నారు. వారు కష్టపడి పంటలు పండించాలని, పదిమందికీ ఉపయోగపడాలి అనుకుంటారు. నేను ఎక్కడున్నా.. వారు నన్ను ఎంతో ఆదరిస్తారు" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి.

అవును... మాదాపూర్ లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... పదిమందిని ఆదుకోవాలనే ఆలోచన కమ్మవారు చేస్తారని.. అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకూ వాళ్లు విస్తరించారని.. ఎన్నో కంపెనీలకు అధిపతులుగా ఉన్నారని అన్నారు.

ఇదే సమయంలో... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్మ కుటుంబ సభ్యులను ఒక్క దగ్గర చేర్చడం అభినందనీయమని అన్నారు. వాస్తవానికి 2023కి ముందే ఈ కార్యక్రమం ఏర్పాటుచేయాలని చెప్పినట్లు రేవంత్ తెలిపారు. అయితే... ఎన్నికలు, ఇతర పలు కారణాల వల్ల అది సాధ్యం కాలేదని.. 90 రోజుల్లోనే అన్ని ఏర్పాట్లూ చేసుకుని కార్యక్రమం ఘనంగా నిర్వహించారని రేవంత్ వివరించారు.

ఈ సందర్భంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు ప్రస్థావన తెచ్చిన రేవంత్.. ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఎన్టీఆర్ నుంచి తాను నేర్చుకున్న విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగా... ఎన్టీఆర్ గ్రంథాలయంలో చదివిని చదువు మమ్మల్ని ఉన్నత స్థానాలు తెచ్చిందని అన్నారు.

ఇదే క్రమంలో... రాజకీయంలోనూ, నాయకత్వంలోనూ ఎన్టీఆర్ అంటే ఓ బ్రాండ్ అని.. ఆయన తెచ్చిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశాన్ని ఏలుతున్నాయని రేవంత్ తెలిపారు. అదే విధంగా... ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి నాయకులు ఉన్నారంటే అది ఆరోజు ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాలే కారణం అని రేవంత్ స్పష్టం చేశారు.

ఇక హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే ప్రణాళికలో మీరు భాగస్వాములు కావాలని కోరిన రేవంత్... మీలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగానూ ప్రోత్సహించడానికి సిద్ధంగ ఉందని.. తమ ప్రభుత్వం నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుందని కమ్మ సోదరులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారు.

Full View


Tags:    
  • Revanthreddy 
  • Congress 
  • Hyderabad 
  • Kammagloobalsummit 
  • Chiefminister 
  • Ntr 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS