కాంగ్రెస్ సీఎంలలో ఒకే ఒక్కడు.. హైకమాండ్ ముందు కాలు మీద కాలేసుకున్న రేవంత్ రెడ్డి

ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్వహించిన కీలక సమావేశంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.

Update: 2026-09-30 06:03 GMT

సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదగడం అంటే సామాన్యమైన విషయం కాదు. అడుగడుగునా సవాళ్లు, సొంత పార్టీలోనే అంతర్గత పోటీ.. ప్రత్యర్థుల విమర్శలు.. వీటన్నింటినీ దాటుకుంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సాగిస్తున్న రాజకీయ ప్రయాణం నిజంగా ఒక స్ఫూర్తిదాయక అధ్యాయం. కాంగ్రెస్ పార్టీలో తనదైన దూకుడుతో అపారమైన ఆత్మవిశ్వాసంతో ఆయన చెక్కుచెదరని ముద్ర వేస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్వహించిన కీలక సమావేశంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగిన గ్రూప్ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందరూ ఎంతో వినయంగా.. సాధారణ స్థితిలో కూర్చుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో 'కాలు మీద కాలు వేసుకుని' కూర్చున్నారు.

ఈ ఒక్క ఫొటో రేవంత్ రెడ్డి స్వభావాన్ని.. ఆయన బాడీ లాంగ్వేజ్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. కాంగ్రెస్ సంస్కృతిలో హైకమాండ్ ముందు నేతలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ తన కష్టాన్నే నమ్ముకుని, ప్రజల మద్దతుతో అధికారాన్ని చేపట్టిన రేవంత్ రెడ్డి.. అధిష్టానం వద్ద కూడా తన నైజమైన 'స్వాగ్'ను వీడలేదు. "హైకమాండ్ ముందు కూడా తనదైన స్టైల్" అంటూ నెటిజన్లు, అభిమానులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సినిమా హీరో ఎలివేషన్ సీన్లను మించి ఈ ఫొటో ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ బాడీ లాంగ్వేజ్ కేవలం ఒక శైలి మాత్రమే కాదు.. అది ఆయన రాజకీయ ఎదుగుదలకు, జాతీయ స్థాయిలో నిర్మించుకుంటున్న స్వతంత్ర ఇమేజ్‌కు ప్రతీక. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ కేవలం తెలంగాణ పాలనకే పరిమితం కాలేదు. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర నేతలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ ఇతర రాష్ట్రాల్లో పార్టీ తరఫున ప్రచారం చేస్తూ జాతీయ స్థాయిలో తన ప్రాభావాన్ని పెంచుకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై, ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై నిత్యం ఘాటు విమర్శలు గుప్పిస్తూ పోరాట పటిమ చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేస్తూనే.. జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. పట్టుదలకు, నిరంతర శ్రమకు, నాయకత్వ లక్షణాలకు రేవంత్ రెడ్డి ప్రయాణం ఒక చక్కటి ఉదాహరణ. సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటూ.. కాంగ్రెస్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న రేవంత్ రెడ్డి ప్రస్థానం వర్ధమాన నాయకులకు ఎంతో స్ఫూర్తిదాయకం..



Tags:    

Similar News