రేవంత్ రెడ్డి మీద మెల్లగా పాజిటివ్ ఒపీనియన్ వచ్చిందా ?
తెలంగాణాలో కేసీఆర్ కి తిరుగులేదు అనుకున్న పరిస్థితి నుంచి ఏకంగా ఆయనను మాజీ సీఎం గా చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే.;
తెలంగాణాలో కేసీఆర్ కి తిరుగులేదు అనుకున్న పరిస్థితి నుంచి ఏకంగా ఆయనను మాజీ సీఎం గా చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే. కాంగ్రెస్ లో జనాకర్షణ కలిగిన నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ కి సారధిగా ఉంటూ 2023 ఎన్నికల్లో పార్టీకి ఒక ఊపు తీసుకుని వచ్చారు.
అంతే కాదు పార్టీని అధికారంలోకి తేవడానికి తన శక్తియుక్తులను ఉపయోగించారు ఇక ఆయన కష్టాన్ని గుర్తించిన మీదట కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రిగా ఆయనకే పట్టం కట్టింది. అయితే కాంగ్రెస్ అన్నది ఒక మహా సముద్రం. అందులో సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. అందరూ నాయకులే ఉన్నారు. దాంతో అందరి మధ్య రేవంత్ రెడ్డి ఎలా సర్దుకు పోతారు అన్న చర్చ అయితే ఉంది.
మొత్తం మీద చూస్తే రేవంత్ రెడ్డి ఏణ్ణర్థం పాటు సీఎంగా తన ప్రస్థానాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించారు. ఈ మధ్యలో వచ్చిన ఎన్నో ఒడిదుడుకులు కూడా ఆయన తట్టుకుని నిలబడ్డారు. ఇపుడు రేవంత్ రెడ్డి రాజకీయంగా సుస్థిరత సాధించారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న పాలన తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అన్నీ కలసి ఆయన పట్ల సానుకూల స్పందన జనంలో వచ్చేలా చేస్తున్నాయని అంటున్నారు.
ఇక పాలన చేపట్టిన కొత్తలో దూకుడుగానే రేవంత్ రెడ్డి వ్యవహరించారు. కొన్ని నిర్ణయాలు ఆయన మంచి ఉద్దేశ్యంతో తీసుకున్నప్పటికీ అవి ఇబ్బందులు కలిగించాయి. అందులో చెప్పుకుంటే హైడ్రా ఒకటి. అలా తెలంగాణాలో మొదటి నుంచి హైడ్రా అని మూసీ నది అని చాలానే జరిగాయి. అంతే కాదు పెద్దల ఇళ్ళను హైడ్రా పేరుతో కూలగొట్టడం జరిగింది.
దీంతో మేలు ఏ మేరకు జరిగిందో తెలియదు కానీ రియల్ ఎస్టేట్ మాత్రం ఒక్కసారిగా పడిపోయింది అన్న ప్రచారం సాగింది. అంతే కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కూడా విమర్శలు వచ్చాయి. ఇలా చాలా అంశాలలో మొదట్లో ఇబ్బంది పడిన రేవంత్ రెడ్డికి ఇపుడు మెల్లగా పాజిటివ్ గా ఒపీనియన్ జనం నుంచి వస్తోంది అని అంటున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కక్ష సాధింపు అని అన్నా ఇపుడు దాని మీద ఎవరూ పెద్దగా చర్చ పెట్టడం లేదు అదే సమయంలో రేవంత్ రెడ్డి తన పాలన దృష్టి మరింత పెంచారు. అంతే కాదు పట్టు కూడా పెంచుకుంటున్నారు. ఇక పాలనలో రేవంత్ రెడ్డి సీనియర్ కాకపోయినా ఎవరిని ఎలా తిప్పుకోవాలో ఆయనకు బాగా తెలుసు అని అంటున్నారు.
ఇక కాంగ్రెస్ అనే మహా సాగరంలో ఎందరో సీనియర్ నేతలు ఉన్నారు. ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి జూనియర్ గా ఉన్నారు. అయితేనేమి ఆయనే సీఎం కుర్చీని తనకు దక్కేలా చేసుకున్నారు. మరి అలా చేశారు అంటే ఆయన వ్యూహాలు తెలివితేటలూ ఎవరూ తక్కువ అంచనా వేయలేరు కదా. అందుకే ఇపుడు కూడా ముఖ్యమంత్రిగా తన పట్టుని బిగిస్తూనే అందరినీ దగ్గర చేసుకోవడంలో తన మార్క్ ని ఆయన చూపిస్తున్నారు అని అంటున్నారు.
అదే సమయంలో మొదట్లో మాదిరిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పెద్దగా కక్ష సాధింపు చర్యలు అయితే లేవు అని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఆయన ఒకే ఆలోచన చేస్తున్నారు. తాను ప్రజల కోసం పనిచేస్తున్నాను అని. తన వెనక ప్రతీ రోజూ ఎందరో విషం కక్కినా అసూయ పడినా తాను పట్టించుకోను అన్న కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇక వారి సంగతి చూసుకోవాల్సింది ప్రజలే అని వారికే వదిలిపెట్టేశారు.
దాంతో రేవంత్ రెడ్డి చూపు అంతా మరో మూడున్నరేళ్ల పాటు చేతిలో ఉన్న అధికారం మీద పాలన మీద అని అంటున్నారు. ఇక దాదాపుగా ఏణ్ణర్థం తరువాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. అయితే ముగ్గురు మంత్రులను కొత్తగా చేర్చుకున్నా ఎలాంటి అసంతృప్తులూ బయటకు రానీయకుండా సాఫీగానే జరిగింది అని అంటున్నారు. అలా తన పట్ల తన నాయకత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత రాకుండా రేవంత్ రెడ్డి చూసుకున్నారు అని అంటున్నారు.
అదే సమయంలో తెలంగాణాలో రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ మెల్లగా పుంజుకుంటోంది అని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూసినపుడు రేవంత్ రెడ్డికి ఎక్కడ లేని ధీమా కనిపిస్తోంది. ఈ టెర్మ్ మాత్రమే కాదు మరో టెర్మ్ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఆయన కచ్చితంగా చెబుతున్నారు. తాను పాతికేళ్ళ పాటు రాజకీయాల్లో ఉంటానని పదేళ్ళ పాటు కంటిన్యూ గా తెలంగాణాకు సీఎం గా పనిచేస్తాను అని కూడా రేవంత్ రెడ్డి నిబ్బరంగా చెబుతున్నారు అంటే ఆయన రాజకీయ వ్యూహాలు ఎంత పదును అయినవో అందరూ అర్ధం చేసుకోవాల్సిందే అని అంటున్నారు.