• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ‘పుష్ప-2’ ఘటన......

‘పుష్ప-2’ ఘటన... కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు?

| దానికి తోడు.. రేవంత్ అసెంబ్లీలో స్పందించిన అదే రోజు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు వ్యాఖ్యలు చేశారు.

By - Tupaki Desk
Update: 2024-12-24 06:05 GMT

'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర స్థాయిలో రాజకీయ రంగు పులుముకుందనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... అసెంబ్లీలో అక్బరుద్దీన్ లేవనెత్తిన అంశానికి సీఎం రేవంత్ రెడ్డి సవివరంగా వివరణ ఇచ్చారు. దీంతో.. మరోసారి ఒక్కసారిగా ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.

దానికి తోడు.. రేవంత్ అసెంబ్లీలో స్పందించిన అదే రోజు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు వ్యాఖ్యలు చేశారు. అయితే.. అందులో కొన్ని అసత్యాలు ఉన్నాయంటు చిక్కడపల్లి పోలీసులు చెప్పిన మాటలను బట్టి అర్ధమవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ నుంచి నేతలకు ఓ కీలక సూచన వచ్చిందని తెలుస్తోంది.

అవును... 'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన కేసు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ విమర్శలు పీక్స్ కి చేరాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఇకపై ఆ అంశంపై ఎవరుబడితే వారు ఎక్కడబడితే అక్కడ స్పందించొద్దని.. రేవంత్ నుంచి కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు జారీ అయినట్లూ చెబుతున్నారు.

ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు వరుసగా ఈ విషయంపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది 'పుష్ప-2' సినిమాపై విమర్శలు చేస్తుంటే.. మరికొంతమంది అల్లు అర్జున్ వ్యవహార శైలిని తప్పుబడుతున్నారని అంటున్నారు. మరికొంతమంది సినిమాపై కేసులు వేస్తున్నారని తెలుస్తోంది.

దీంతో... అటు అల్లు అర్జున్, ఇటు సినిమా ఇండస్ట్రీపైనా తెలంగాణ సర్కార్ కక్షగట్టిందా.. ఇండస్ట్రీ హైదరాబాద్ ని వదిలి వెళ్లిపోతుందా అనే చర్చలు సైతం మొదలయ్యాయని అంటున్నారు. సోమవారం చిత్ర నిర్మాతలతో కలిసి శ్రీతేజ్ ని పరామర్శించిన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి ఈ విషయాలను ప్రస్థావించారు కూడా!

ఈ నేపథ్యంలోనే... కాంగ్రెస్ పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు జారీ అయినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఇకపై అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా మాట్లాడటం మానుకోవాలని.. మీడియా ముందు ఈ విషయాలపై వ్యాఖ్యానించొద్దని సీఎం తెలిపారని అంటున్నారు.

Tags:    
  • Revanthreddy 
  • Congress 
  • Congressleaders 
  • Pushpa2 
  • Alluarjun 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

Copyright @2026

Powered by Blink CMS