• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీఆర్ఎస్ కాదు...డీఆర్ఎస్...

బీఆర్ఎస్ కాదు...డీఆర్ఎస్ !

| అదేంటి టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారింది కదా మళ్ళీ డీఆర్ఎస్ అని ఈ కొత్త పేరు ఏమిటి అన్న చర్చ అయితే తెలంగాణా రాజకీయ అభిమానులలో కలగవచ్చు.

By - Tupaki Desk
Update: 2025-06-07 03:56 GMT

అదేంటి టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారింది కదా మళ్ళీ డీఆర్ఎస్ అని ఈ కొత్త పేరు ఏమిటి అన్న చర్చ అయితే తెలంగాణా రాజకీయ అభిమానులలో కలగవచ్చు. కానీ ఈ కొత్త పేరుని పెట్టింది గులాబీ బాసులు కానే కారు. వారికి రాజకీయంగా ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆయన బీఆర్ఎస్ ని కాస్తా డీఆర్ఎస్ అనేసారు.

ఆ పేరు ఫుల్ ఫార్మ్ లో ఆయనే చెప్పారు. దెయ్యాల రాజ్య సమితి అని దాని అసలు పేరుట. దెయ్యాలు మధ్యలో ఎక్కడ నుంచి వచ్చాయంటే ఎక్కడో ఏమిటి కేసీఆర్ సొంత బిడ్డ కవిత చెప్పిందిగా అని రేవంత్ రెడ్డి భలే లాజిక్ పాయింట్ తీశారు ఈ మధ్యనే కవిత కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ దెయ్యాలు చాలా చేరాయని అవన్నీ కోటరీగా ఏర్పాటు అయ్యాయని ఘాటు విమర్శలు చేశారు.

దాంతో ఏకంగా కవిత మాటలనే పట్టుకుని గులాబీ కోటకే వాటిని గట్టిగా తిప్పి బలంగా ప్రయోగించారు అన్న మాట. దెయ్యాల రాజ్య సమితి అంటూ రేవంత్ రెడ్డి పెట్టిన ఈ కొత్త పేరు అయితే వైరల్ అవుతోంది. బీఅర్ఎస్ ని ఇక మీదట ఆయన అలాగే సంభోదించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

తనకు జీవిత కాలంలో లక్ష్యాలు అంటూ ఏవీ లేవని అవన్నీ నెరవేర్చుకున్నాను అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తనను అన్యాయంగా జైలుకు పంపిన కేసీఆర్ ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని అనుకున్నానని అది సాధ్యపడిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అలా కేసీఅర్ కుర్చీలో కూర్చుని తన జీవిత కాలం లక్ష్యం నెరవేర్చుకున్నానని ఆలేరు సభలో రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇక తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయమని అన్నారు. ఎవరు అడ్డుపడినా అభివృద్ధి చేసి తీరుతామని ఆయన స్పష్టంగా చెప్పారు. అపరిశుభ్రంగా ఉన్న మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయకూడదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో అడ్డుకుంటున్న వారి అభివృద్ధి నిరోధకులు అని ఆయన ఆగ్రహించారు.

తాను అభివృద్ధి బాటన నడుస్తూంటే బీఆర్ఎస్ నేతలు లేని పోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పదేళ్ళ పాటు సీఎం గా ఉన్న కేసీఆర్ ఏనాడైనా ప్రతీ నెలా ఒకటవ తేదీకి ఉద్యోగులకు జీతాలు ఇచ్చారా అని రేవంత్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణాను ఎనిమిది లక్షల కోట్ల మేర అప్పుల పాలు చేసారు అని ఆయన ఆరోపించారు.

అభివృద్ధిని మరచి పదేళ్ళ పాటు బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. దెయ్యాల రాజ్య సమితికి దెయ్యాల అధినేత ఉన్నారని ఆయన ఫాం హౌస్ లో పడుక్కుంటునారని కేసీఅర్ మీద పరోక్ష విమర్శలు చేశారు. ఈ దె య్యాలను తెలంగాణా నుంచి తరిమికొట్టే బాధ్యతను తాను తీసుకుంటాను అని రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం.

Tags:    
  • RevanthReddy 
  • BRS 
  • TelanganaPolitics 
  • KCR 
  • DevilsRajyaSamithi 
  • TRS 
  • PoliticalDrama 
  • TelanganaDevelopment 
  • IndianPolitics 
  • PoliticalControversy 

Similar News

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

క్లీన్ సిటీల జాబితాలో ఏపీ సత్తా.. విజయవాడ, విశాఖ, గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు!

2026-11-12 05:48 GMT

పవన్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్.. అరెస్ట్

2026-11-12 04:24 GMT

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

2026-11-12 03:23 GMT

Copyright @2026

Powered by Blink CMS