40ల్లోనే 'నిర్వీర్యం'.. ఏం జరుగుతోంది?
'సంసార బానిసలము.. సంతాన బాధితులము' అంటూ ఆకలిరాజ్యం సినిమాలో పాట నేటి తరానికి తెలియక పోవచ్చు. ఎందుకంటే.. 40ల్లోనే సంసారం అంటే.. వైముఖ్యం వచ్చేస్తోంది.;
'సంసార బానిసలము.. సంతాన బాధితులము' అంటూ ఆకలిరాజ్యం సినిమాలో పాట నేటి తరానికి తెలియక పోవచ్చు. ఎందుకంటే.. 40ల్లోనే సంసారం అంటే.. వైముఖ్యం వచ్చేస్తోంది.. 40+లో సంతానం కలగడమూ కష్టంగానే మారిపోయింది. దీంతో యువత 40ల్లోనే 'నిర్వీర్యం' అయిపోతోందట. ఈ మాట ఎవరో కాదు.. జాతీయ ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. ఏటా జాతీయస్థాయిలో దేశవ్యాప్తంగా ప్రజారోగ్యంపై సర్వే నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన రిపోర్టులో అనేక అంశాలను పేర్కొంటారు.
అంటువ్యాధుల నుంచి కేన్సర్ సహా.. అన్ని రోగాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తారు. ఇలా.. సంసార సుఖానికి సంబంధించిన అంశాల్లో కీలక విషయాలు ఈ ఏడాది వెలుగు చూశాయి. 40 ఏళ్ల వయసు దాటిన.. 45కు చేరని వారిలో అంటే.. 40-45 ఏళ్ల మధ్యలో వ్యక్తులకు.. పటుత్వ పట్టు తప్పుతోంద ని తద్వారా.. సంసార సుఖానికి దూరమవుతున్నారని సర్వే పేర్కొంది. ఇది.. మాదకద్రవ్యాల అలవాటుకు దారితీస్తోందన్నది మరో సంచలన విషయం. కొందరిలో హైపర్ టెన్షన్.. మరింత మందిలో షుగర్ వ్యాధి కారణంగా.. ఈ పరిణామాలు ఏర్పడుతున్నాయని సర్వే చెప్పడం గమనార్హం.
ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో, విజయవాడ, ఇండోర్, అహ్మదాబాద్, గాం ధీనగర్ వంటి మినీ మెట్రో/ లేదా మెట్రో రహిత ప్రధాన నగరాల్లోనూ ఈ సమస్య ఉందని సర్వే వెల్లడిం చింది. 52 శాతం మందిలో వీర్యకణాలు అసలు పటుత్వం కోల్పోతున్నట్టు చెప్పడం.. 41 శాతం మందిలో అసలు స్తంభన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. గత ఏడాది సర్వేలో 32 శాతం మందిలో స్తంభన సమస్యలు ఉండగా.. ఈ ఏడాది 9 శాతం పెరిగాయని తెలపడం గమనార్హం.
ఇక, మహిళల విషయానికి వస్తే.. 30-35 ఏళ్లవారిలో విపరీతమైన కోరికలు జనిస్తున్నాయని.. దీనివల్ల వారి లో సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయని సర్వే తెలపడం గమనార్హం. మూడు మాసాలకు ఒక్కసారి కూడా శృంగార పరమైన జీవితాలకు దూరంగా ఉన్న కుటుంబాలు.. గత ఏడాది 26 శాతం ఉంటే.. ఈ ఏడాదికి 37 శాతానికి చేరాయని సర్వే తెలిపింది. దీనివల్ల జనాభా పెరుగుదలపై ప్రభావం చూపుతుందని.. దీనిపై కేంద్ర ఆరోగ్య సంస్థ.. సత్వరమే చర్యలు తీసుకోవాలని.. సూచించడం గమనార్హం.