రఫ్ఫాడించిన రేణూ దేశాయ్...రాజకీయాలోకి వస్తున్నారా ?
ఇక తాను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చేస్తున్న ప్రచారం మీద ఆమె ప్రెస్ మీట్ అనంతరం సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.;
రేణూ దేశాయ్ అంటే తెలుగు వారికి తెలిసిన పేరే. ఆమె కొన్ని సినిమాల్లో నటించారు. జంతు సంక్షేమ సంఘం తరఫున సేవలు అందిస్తున్నారు. ఆమె తాజాగా హైదరాబాద్ లో పెట్టిన ప్రెస్ మీట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రేణూ దేశాయ్ ఉగ్ర రూపం ఇప్పటిదాకా చూడని వారు అంతా ఈ విధంగా చూసి ఒక విధంగా షాక్ తింటున్నారు. ఏకధాటిగా ముప్పై ఆరు నిముషాల పాటు ఆమె మాట్లాడి రఫ్ ఆడించేశాశారు.
అందరికీ ఇచ్చి పడేశారు :
కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఇస్తున్న ఆదేశాల మీద ఆమె మండిపడ్డారు. అదే సమయంలో సమాజంలో జరుగుతున్న సవాలక్ష సంఘటనల మీద ప్రజలలో ఎందుకు చైతన్యం లేదని కూడా ప్రశ్నించారు. ఇక రేణూ దేశాయ్ లాజిక్ తో కూడిన అనేక ప్రశ్నలను కూడా సంధించారు దానికి జవాబు వెతుక్కోవడం ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో చూసిన వారు చేయాల్సిన పనిగానే ఉంది.
నో పాలిటిక్స్ అంటూ :
ఇక తాను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చేస్తున్న ప్రచారం మీద ఆమె ప్రెస్ మీట్ అనంతరం సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. తనకు రాజకీయాల్లోకి రావడం పట్ల ఆసక్తి కానీ ఇష్టం కానీ లేవని ఆమె చెప్పారు. అంతే కాదు తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని ఆమె స్పష్టం చేశారు. తనకు సామాజిక సేవా కార్యక్రమాలు ముఖ్యమని అన్నారు. అలాగే తాను ఒక ఎన్జీవో ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ హాయిగా ఉన్నాను అని చెప్పారు. ఈ తరహా రూమర్స్ ని ప్రచారంలో పెట్టవద్దని ఆమె కోరారు.
ముడి పెట్టవద్దు :
తన వ్యక్తిగత జీవితానికి ముడి పెట్టి చేసే ప్రచారాలను కూడా ఆపాలని ఆమె కోరుతున్నారు. తప్పుడు థంబ్ నెయిల్స్ పెడుతూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆపాలని ఆమె రిక్వెస్ట్ చేశారు. ఇక తనకు ప్రెస్ అంటే ఎంతో గౌరవం ఉందని ఆమె చెప్పారు. ప్రెస్ మీట్ జరుగుతుండగా ఒక 55 ఏళ్ల వ్యక్తి తన మీద కేకలు వేసుకుంటూ వచ్చారని, తన దగ్గరగా వచ్చి కొట్టడానికి కూడా ప్రయత్నం చేశాడని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఆవేశపడాల్సి వచ్చింది అని అన్నారు. ఇక తన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకుందని ఆమె చెప్పారు.
ఇది పద్ధతా :
పవన్ కళ్యాణ్ నిన్ను ఎందుకు వదిలేశాడో ఇపుడు మాకు అర్ధం అయిందని కామెంట్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తిక్క ఉందని ఎన్నో రకాలుగా నిందిస్తూ మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. దయచేసి ఎవరూ తప్పుడు కామెంట్స్ చేయవద్దు అని ఆమె కోరుకున్నారు. మొత్తానికి రేణూ దేశాయ్ ప్రెస్ మీట్ మాత్రం గరం గరంగా సాగింది అంతే కాదు ఆమె ఎన్నడూ లేని విధంగా ఉగ్ర రూపం చూపించారు. అయితే ఆమె తన బాధ వెనక విషయం ఏమిటో చెప్పారు. తాను డబ్బు కోసం కాదు మనుషుల ప్రాణాల కోసమే మాట్లాడుతున్నాను అని చెప్పారు. ఏది ఏమైనా రేణూ దేశాయ్ ప్రెస్ మీట్ అయితే తెగ వైరల్ అవుతోంది.