• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆర్బీఐ కొత్త నిబంధనలు......

ఆర్బీఐ కొత్త నిబంధనలు... లాకర్‌ లో డబ్బులు దాచుకోవచ్చా?

| సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంకు లాకర్‌ భద్రతపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

By - Tupaki Desk
Update: 2023-10-03 04:53 GMT

ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్‌ లో ఇటీవల కుమార్తె పెళ్లి కోసమని ఓ మహిళ రూ.18 లక్షల మొత్తాన్ని బ్యాంక్‌ లాకర్లలో పెట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె డబ్బులు దాచుకున్న సుమారు ఏడాదిన్నర తర్వాత వెళ్లి చూస్తే ఆ మొత్తం చెద పురుగులు తినేశాయి. ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము పోవడంతో ఆమె భోరుమంది. దీంతో లాకర్ నిబంధనలపై చర్చ మొదలైంది. ఇంతకీ బ్యాంక్‌ లాకర్లలో నగదు పెట్టొచ్చా? ఆర్బీఐ నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

నగలు, విలువైన ఆభరణాలు వంటివి ఇంట్లో ఉంచుకుంటే దొంగలు ఎత్తుకుపోతారేమోనని చాలామంది భయపడిపోతుంటారు. అందుకే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. అలా ఇప్పటికే చాలామంది లాకర్లు తీసుకుని బ్యాంకుల్లో నగలు, విలువైన వస్తువులు, ఆస్తిపత్రాలు మొదలైన వాటిని దాచిపెడుతుంటారు. ఈ సమయంలో కొంతమంది నగదు కూడా పెడుతుంటారు!

ఆర్బీఐ కొత్త నిబంధనల్లో ఏముంది?

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంకు లాకర్‌ భద్రతపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు బ్యాంకు లాకరులో ఉంచిన ఏ వస్తువులు పోయినా బ్యాంకు మేనేజ్మెంట్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది. బ్యాంక్‌ నిర్లక్ష్యం కారణంగా లాకర్‌ లో ఉన్న వస్తువులు పోతే.. లాకర్‌ అద్దెకు 100 రెట్లు వినియోగదారుడికి చెల్లించాల్సి ఉంటుంది.

అంటే... బ్యాంకులో ఏదైనా అగ్నిప్రమాదం జరిగినా.. లేక, దొంగతనం వంటివి జరిగినా.. అదీగాక, బ్యాంకు బిల్డింగే కూలిపోయి లాకర్‌ లో ఉన్న వస్తువులు ధ్వంసమైనా.. బ్యాంక్ మేనేజ్‌మెంట్‌ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.

అయితే... బ్యాంక్‌ లాకర్లలో నగదు దాచిపెట్టడంపై మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. లాకర్లలో పెద్ద నోట్ల నిల్వలను అరికట్టడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఈ నిబంధనను తీసుకొచ్చింది. దీంతో పాటు బ్యాంకులో ఎలాంటి వస్తువులు దాచుకోవాలి.. మరెలాంటి వస్తువులు దాచకూడదనే దానిపై ఈ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది.

ఈ నిబంధనల ప్రకారం నగలు, బంగారం వంటి విలువైన వస్తువులు, పత్రాలను మాత్రమే లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించింది. కరెన్సీ నోట్లు, ఆయుధాలు, పేలుడు సామగ్రి, మాదక ద్రవ్యాలు, రేడియేషన్‌ పరికరాలు, చట్ట విరుద్ధమైన వస్తువులు వంటివి బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోకూడదు!

Tags:    
  • Rbi 
  • Supremecourt 
  • Locker 
  • Bank 
  • Reservebank 
  • Newregulations 
  • Gold 
  • Money 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS