మోడీ ప్రభుత్వానికి తగిలిన బంపర్ లాటరీ.. RBI నుండి రూ.3 లక్షల కోట్ల చెక్కు!

ఈసారి కేంద్రానికి నిజంగా పండగే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో ఏకంగా 3 లక్షల కోట్ల రూపాయల చెక్కు ఇవ్వబోతోందట.;

Update: 2025-05-17 10:54 GMT

ఈసారి కేంద్రానికి నిజంగా పండగే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో ఏకంగా 3 లక్షల కోట్ల రూపాయల చెక్కు ఇవ్వబోతోందట. ఆర్బీఐ తన బోర్డు మీటింగ్‌లో ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి డివిడెండ్‌గా ఇవ్వడానికి ఓకే చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ ఇది జరిగితే, కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను లేదు అని చెప్పిన టైంలో పన్నుల ద్వారా వచ్చే డబ్బు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ డివిడెండ్ ప్రభుత్వానికి చాలా ఉపయోగపడుతుంది. అసలు ఈ డివిడెండ్ ఎలా ఇస్తారు..దాని వెనుక ఉన్న లెక్కలేంటి, మార్కెట్‌లో దీని గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయో తెలుసకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బోర్డు మీటింగ్ మే 23న జరగనుంది. ఈ మీటింగ్‌లో బ్యాంకు బ్యాలెన్స్ షీట్‌ను పరిశీలిస్తారు. అంతేకాకుండా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మిగులు నిధులను (surplus fund) ప్రభుత్వానికి ఇవ్వడం గురించి కూడా నిర్ణయం తీసుకుంటారు. ఈ మొత్తం దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పోయినసారి ఇచ్చిన డివిడెండ్ కంటే ఇది దాదాపు 50 శాతం ఎక్కువ. IDFC ఫస్ట్ బ్యాంక్ ఎకనామిస్ట్ గౌరా సేన్ గుప్తా చెప్పిన దాని ప్రకారం, RBI డివిడెండ్ 2.6 లక్షల కోట్ల నుండి 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

డివిడెండ్ ఎలా నిర్ణయిస్తారు?

ఆర్బీఐ బోర్డు మే 15న ఆర్థిక నిల్వల గురించి ఒక మీటింగ్ కూడా నిర్వహించింది. మిగులు నిధులు లేదా డివిడెండ్‌ను నిర్ణయించడంలో ఇది చాలా ముఖ్యం. ఆర్బీఐ విధానాన్ని 2019లో మొదలుపెట్టింది. ఒక కమిటీ సూచనల ప్రకారం, రిస్క్ కోసం ఉంచే నిధులను (Contingent Risk Buffer - CRB) RBI బ్యాలెన్స్ షీట్‌లో 6.5 శాతం నుండి 5.5 శాతం మధ్యలో ఉంచాలని నిర్ణయించారు. అంతేకాకుండా, ఈ డివిడెండ్ అనేది RBIకి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూసి, దాని ప్రకారం CRB నిధులను ఎంత ఉంచాలో బోర్డు నిర్ణయిస్తుంది. ఆర్థిక వ్యవస్థ బాగా పెరిగితే, ఎక్కువ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News