• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డీప్ ఫేక్ వ్య‌క్తి...

డీప్ ఫేక్ వ్య‌క్తి అరెస్ట్..అత‌ను ఇత‌డే

| ర‌ష్మిక మంద‌న్నా డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. సెల‌బ్రిటీల‌కు సంబంధించి అదే తొలి వీడియో కావ‌డంతో చాలా మంది సెలబ్రిటీలంతా పెద్ద ఎత్తున స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

By - Tupaki Desk
Update: 2024-01-20 11:27 GMT

ర‌ష్మిక మంద‌న్నా డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. సెల‌బ్రిటీల‌కు సంబంధించి అదే తొలి వీడియో కావ‌డంతో చాలా మంది సెలబ్రిటీలంతా పెద్ద ఎత్తున స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. నిందుతుల్ని క‌ఠ‌నింగా శిక్షించాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఆ వీడియో త‌ర్వాత మ‌రికొంత మంది సెల‌బ్రిటీలు డీప్ ఫేక్ బారిన ప‌డ్డారు. మరోవైపు వివిధ సైబ‌ర్ క్రైమ్ లో పోలీస్ కేసులు న‌మోదయ్యాయి.

ఇలాగే వ‌దిలేస్తే మ‌రింత మంది సెల‌బ్రిటీలు డీప్ ఫేక్ బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని తేలిపోయింది. దీంతో పోలీసులు కేసును స‌వాల్ గా తీసుకుని ముందుకెళ్లారు. తాజాగా ఆ డీప్ ఫేక్ దుండ‌గుడు ఎవ‌రో తెలిసి పోయింది. ఎట్ట‌కేల‌కు ఢిల్లీ పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం అత‌డు పోలీసులు అదుపులో ఉన్న‌ట్లు...అత‌న్ని విచారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అత‌డి వివ‌రాలన్నింటిని గోప్యంగా ఉంచారు .

ఎక్క‌డా లీక్ అవ్వ‌కుండా పోలీసులు అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి అత‌గాడి వివ‌రాలు గోప్యంగా ఉంచుతారా? మీడియా ముందు ప్ర‌వేశ పెడ‌తారా? అన్న‌ది చూడాలి. ఈ కేసు విష యంలో కొన్ని ఆధారాలు లభించిన‌ట్లు ఢిల్లీ పోలీసులు గ‌తంలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. వాటి ఆధారంగానే ఆ వ్య‌క్తిని రెక్కీ వేసి ప‌ట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. టెక్నిక‌ల్ డేటాతో ఆ వీడియో ఎక్క‌డ అప్ లోడ్ చేసారు? దాని ఐపీ అడ్ర‌స్ లు ఏంటి? క‌నుక్కుని ప‌క్కా ఆధారాల‌తో అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ర‌ష్మిక త‌ర్వాత మ‌రికొంత మంది సెలబ్రిటీలు కూడా డీప్ ఫేక్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. మరి ఆ న‌టీనటుల వీడియోల వెనుక అరెస్ట్ అయిన వ్య‌క్తి ఉన్నాడా? అత‌నే ఇవ‌న్నీ చేస్తున్నాడా? వాటిలో అత‌డి ప్రేమేయం ఏదైనా ఉందా? లేక కొత్త వాళ్లు ఎవ‌రైనా ఉన్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.




Tags:    
  • Deepfakevideo 
  • Rashmika 
  • Police 
  • Arrest 
  • Delhipolice 
  • Actressrashmika 
  • Filmindustry 

Similar News

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

Copyright @2026

Powered by Blink CMS