రప్పా రప్పా...వైసీపీ సూప్ లో పడిందా ?

జగన్ గుంటూరు జిల్లా రెంటపాళ్ళ పర్యటన చేసినపుడు ఎవరో ఒక యువకుడు రప్పా రప్పా అంటూ పుష్ప సినిమాలో డైలాగులతో ఫ్లెక్సీ కట్టి ప్రదర్శించాడు. తీరా చూస్తే ఆ యువకుడు టీడీపీ కార్యకర్తే అని తేలిందట.;

Update: 2025-07-18 15:30 GMT

జగన్ గుంటూరు జిల్లా రెంటపాళ్ళ పర్యటన చేసినపుడు ఎవరో ఒక యువకుడు రప్పా రప్పా అంటూ పుష్ప సినిమాలో డైలాగులతో ఫ్లెక్సీ కట్టి ప్రదర్శించాడు. తీరా చూస్తే ఆ యువకుడు టీడీపీ కార్యకర్తే అని తేలిందట. ఇక అతన్ని అరెస్ట్ చేశారు. వైసీపీ వారే ఇదంతా చేయిస్తున్నారు అని రప్పా రప్పా అని హింసా రాజకీయాలు చేయడానికి ఆలోచిస్తారా అని టీడీపీ కూటమి పెద్దల నుండి చిన్న వరకూ అందరూ వైసీపీ మీద పడ్డారు.

దాని మీద గత మీడియా ప్రెస్ మీట్ లో జగన్ కి ప్రశ్న ఎదురైనపుడు రప్పా రప్పా అన్నది సినిమా డైలాగ్ కదా. అది చెప్పినా తప్పేనా అన్నారు. పుష్పా మేనరిజం కూడా చేసి చూపించారు. అయితే జగన్ రప్పా రప్పా అన్న దాని మీద ఖండించకుండా అలా చేయడం మీద మరింతగా కూటమి పెద్దలు విమర్శలు దట్టించారు. అయినా సరే రప్పా రప్పా అన్నది వైసీపీ కార్యకర్త కాదు మాకు ఏమాత్రం సంబంధం లేదు అని ఆ బురదను తమ మీదకు తెచ్చుకోకుండా పక్కకు పెట్టాల్సిన వైసీపీ అధినేత రప్పా రప్పా అంటే తప్పేమిటి అని ఒక డిబేట్ గా చేస్తున్నారని అంటున్నారు.

తాజా ప్రెస్ మీట్ లో సైతం ఆయన బాలయ్య పవన్ కళ్యాణ్ సినిమాలలో డైలాగులు దారుణంగా ఉంటాయని విమర్శించారు. ఆ డైలాగులు బాగులేనపుడు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని అన్నారు. అంతే తప్ప డైలాగులు చెప్పారనో ఫ్లెక్సీలు కట్టారనో అరెస్టు చేయడమేంటి అని కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.

నిజానికి సినిమాలో ఎన్నో డైలాగులు ఉంటాయి. అలాగే కృత్రిమ సన్నివేశాలు ఎన్నో ఉంటాయి అవన్నీ వినోదం కోసమే. వాటిని రాజకీయాల్లోకి తెచ్చి అక్కడ వాడారు కాబట్టి మేము అంటామని అనడం ఏ మేరకు సబబు అని అంటున్నారు. పైగా జగన్ లాంటి వారు ఈ తరహా వాటి మీద మాకు సంబంధం లేదు రప్పా రప్పా మా కల్చర్ కాదని చెప్పాల్సింది ఉండగా కూటమి ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని నిందించడమేంటని అంటున్నారు.

నిజానికి ఈ తరహా స్లోగన్స్ వల్ల జనాలతో నేరుగా అనుసంధానం అయ్య్తే ప్రయత్నాలు కూడా సక్సెస్ కావని అంటున్నారు. జనాల ఆలోచనలు కూడా ఈ తరహా డైలాగుల పట్ల వేరేగా ఉంటాయని అవి వైసీపీకి ఏ మాత్రం ఉపయోగకరంగా ఉండవని అంటున్నారు.

ఇక తమ పార్టీ అధినేతే ఈ విధంగా మద్దతు ఇస్తున్నారు కాబట్టి తాము ఏమి మాట్లాడినా చెల్లుతుంది అని వైసీపీ క్యాడర్ అనుకుంటే అది మరింతగా ప్రమాదంగా మారుతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. జనాలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం జగన్ మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు.

అంతే తప్ప ఈ తరహా విషయాల మీద ఆయన మాట్లాడడం వల్ల రాంగ్ సిగ్నల్స్ ని అటు పార్టీ వారికి ఇటు జనాలకు వెళ్తాయని అంటున్నారు. ఏది ఏమైనా రప్పా రప్పా అని ఒక యువకుడు కట్టిన ఫ్లెక్సీ వైసీపీని పూర్తిగా సూప్ లో పడేసింది అని అంటున్నారు. రెడ్ బుక్ అని ఒక వైపు కూటమిని ఎంత నిందిస్తున్నా రెడ్ బుక్ పేరుతో తీసుకుంటున్న చర్యలు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి. ఫలనా సెక్షన్ల ప్రకారం కేసు కట్టి అరెస్ట్ చేస్తున్నామని చెబుతున్నారు. మరి రెడ్ బుక్ కి విరుగుడుగా రప్పా రప్పా అని వైసీపీ అంటే అది బూమరాంగ్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే రప్పా రప్పా అన్న దానికి అర్ధాలు జనాలకే బాగా తెలుసు అని అంటున్నారు.

Tags:    

Similar News