• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హైడ్రా కీలక నిర్ణయం.....

హైడ్రా కీలక నిర్ణయం.. కొత్త ఏడాది నుంచి అమల్లోకి..

| గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-12-04 15:30 GMT

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. భవిష్యత్ తరాలకు హైదరాబాద్ నగరానికి ఎలాంటి ముంపు ముప్పు లేకుండా అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను తెరమీదకు తీసుకొచ్చారు.

గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై ఫోకస్ చేయడమే హైడ్రా ప్రధాన ఉద్దేశం. అందులోభాగంగానే కొత్త ప్రభుత్వం కొలువుదీరాక కొద్ది నెలలకే హైడ్రాను ఏర్పాటు చేశారు. దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించారు. ఇక.. హైడ్రా ఏర్పాటు మరుసటి రోజు నుంచే తన కార్యకలాపాలను ప్రారంభించింది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ వస్తున్నది. పేద, ధనిక, పొలిటికల్, ఆఫీసర్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి నిర్మాణాలను కూల్చివేస్తూ వచ్చింది.

ఇప్పటివరకు దాదాపు 300లకు పైగా అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. వీరిలో టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ సైతం ఉంది. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత సందర్భంగా హైడ్రా పేరు దేశవ్యాప్తంగానూ మారుమోగింది. ముఖ్యంగా చెరువులు, కుంటల బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటి భరతం పడుతోంది. దీని బలోపేతానికి ప్రభుత్వం కూడా చాలా వరకు అధికారాలను బదలాయించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి సంబంధించిన పలు అధికారాలను బదలాయించారు. అలాగే.. హైడ్రాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానికి చట్టబద్ధతను సైతం తీసుకొచ్చారు. ఇలా రోజురోజుకూ ప్రభుత్వం తరఫున హైడ్రాకు కావాల్సిన సదుపాయాలను సమకూరుస్తూ దానిని మరింత స్ట్రాంగ్ చేస్తున్నారు. తాజాగా.. హైడ్రాకు యంత్రాలు తదితర కొనుగోలు నిమిత్తం ప్రభుత్వం రూ.50 కోట్లు రిలీజ్ చేసింది.

ఇదిలా ఉండగా.. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆక్రమణలపై ఇక నుంచి ప్రతీ సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించారు. బుద్ధభవన్‌లో ఈ ఫిర్యాదులను స్వీకరించనున్నారు. కాగా.. కొత్త ఏడాది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రెడీగా ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై ప్రజల నుంచి హైడ్రా అధికారులు ఫిర్యాదులు తీసుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపడుతుందని రంగనాథ్ వెల్లడించారు.

ప్రజా ఉద్యమంలా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని రంగనాథ్ వెల్లడించారు. తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే తాము ఇప్పటివరకు కూల్చివేశామని, పేదల ఇళ్లను ముట్టుకోలేదని తెలిపారు. అనుమతులు ఉన్న వేటినీ తాము పట్టించుకోలేదని తెలిపారు. అనుమతులు లేని వాటిని పక్షపాతం లేకుండా కూల్చివేశామని స్పష్టం చేశారు. గ్రేటర్ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై ఇప్పటికే 4 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.

Tags:    
  • Hydraa 
  • Ranganath 
  • Hydraacomissioner 
  • Hyderabad 
  • Telangana 
  • Revanthreddy 
  • Congress 
  • Musi 
  • Hydraamission 
  • Tgpolitics 
  • Greaterhyderabad 

Similar News

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

Copyright @2026

Powered by Blink CMS