మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డి కి బెర్త్ దక్కుతుందా?

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం తథ్యం కావడంతో ఆయన ఆశలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి.

Update: 2024-03-30 05:32 GMT

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. ఎంపీ ఎన్నికల అనంతరం ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈనేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. దీంతో భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది. భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మిని పోటీ చేయించాలని అధిష్టానం సూచించినా రాజగోపాల్ రెడ్డి అంగీకరించలేదు.

కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి మంత్రి ఇస్తామని ఇచ్చిన హామీతోనే ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చారని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి వస్తుందనే ఆశతోనే ఉన్నారు.

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం తథ్యం కావడంతో ఆయన ఆశలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. హోం మినిస్టర్ అవుతానని పలు సందర్భాల్లో ఆయన తన మనసులోని మాటను చెప్పేస్తున్నారు. ఆయనకు ఏ పదవి ఇస్తారో తెలియదు. కానీ మంత్రి పదవిపై ఆయనకు మక్కువ ఎక్కువ అనే విషయం తెలుస్తోంది.

Read more!

పార్లమెంట్ ఎన్నికల తరువాత మంత్రి వర్గ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే పార్టీలో హడల్ ఉంటుంది. అందుకే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే తెలుస్తోంది. ఈనేపథ్యంలో కోమటిరెడ్డికి మంత్రి పదవి బెర్త్ సిద్ధం అయిపోయిందనే చెబుతున్నారు.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎక్కువ సీట్లు గెలుచుకుని ప్రతిపక్షాలకు సవాలు విసరాలని చూస్తోంది. ఇందులో భాగంగానే తనదైన శైలిలో ఆలోచించి టికెట్లు ఇస్తోంది. గెలుపు గుర్రాలనే ఎంచుకుంటోంది. ఇక్కడ నుంచి ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.

Tags:    

Similar News