రాహుల్ కి షాకింగ్ రిక్వెస్ట్....స్వీట్ కోసమని వెళ్తే !

రాహుల్ గాంధీకి ఒక తీయని అనుభవం ఎదురైంది. అది కూడా దీపావళి పండుగ వేళ.;

Update: 2025-10-21 04:52 GMT

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత, గాంధీల వంశంలో అయిదవ తరానికి చెందిన వారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు. ఇలా ముందు చాలానే ఉన్నాయి. ఇక రాహుల్ గాంధీ ఇప్పటికి అయిదు సార్లు ఎంపీగా గెలిచి లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన రాజకీయం గురించి చెప్పాలంటే అది వేరే స్టోరీ. ఇక రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఆయన పెళ్ళి చేసుకోలేదు. రాహుల్ వయసు అక్షరాలా 55 ఏళ్ళు. అయినా ఎక్కడా గ్లామర్ తగ్గలేదు, ఆయన సరే అంటే పెళ్ళి చేసుకోవడానికి క్యూ కట్టే లేడీస్ కి కొదవ లేదు. అయితే ప్రాబ్లమల్లా రాహుల్ గాంధీ పెళ్ళికి ఓకే చెప్పకపోవడమే. అందుకే అంతా అంటున్నారు ఆయన్ని పెళ్ళిచేసుకోమని.

తీయని అనుభవం :

రాహుల్ గాంధీకి ఒక తీయని అనుభవం ఎదురైంది. అది కూడా దీపావళి పండుగ వేళ. రాహుల్ గాంధీ చాలా కాలంగా ఢిల్లీలోని ఒక స్వీట్ షాప్ లో స్వీట్స్ కొనుగోలు చేస్తూ వస్తున్నారు అలా ఆయన ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాప్ కి వెళ్ళారు. అక్కడ ఆయన్ తన కుటుంబానికి స్నేహితులకు స్వీట్లు కొనుగోలు చేయడమే కాదు తానే స్వయంగా రెండు స్వీట్లు కూడా తయారు చేశారు. రాహుల్ కి వంటలు వచ్చు అన్నది ఇక్కడ గమనించాలి. అంతే కాదు ఆయనకు వంటలు చేయడం అన్నది ఒక హాబీ కాదు ఆసక్తి కూడా ఉంది. అందుకే తాను స్వీట్లు కొనుగోలుతో పాటు తయారు చేస్తాను అంటే యజమాని సైతం ఓకే చెప్పేశారు. అయితే ఇదే సందర్భంలో రాహుల్ ని షాప్ యజమాని సుశాంత్ జైన్ ఒక తీయని అభ్యర్ధన చేశారు. రాహుల్ జీ తొందరగా పెళ్ళి చేసుకోండి జీ అంటూ.

రాహుల్ ఏం చెప్పారంటే :

అయితే ఈ తరహా రిక్వెస్ట్ తనకు వస్తుందని అసలు ఊహించలేదు రాహుల్ గాంధీ. అందుకే ఆయన దానికి బదులు అయితే ఇవ్వలేదు, తాను బేసిన్ లడ్డూ, అలాగే ఇమర్తి తయారు చేశారు. అయితే స్వీట్ షాప్ యజమానికి రాహుల్ తో ఉన్న చనువు కారణంగానే ఈ రిక్వెస్ట్ చేశారు. రాహుల్ మీరు పెళ్ళి చేసుకుంటే భారీ ఎత్తున స్వీట్ ఆర్డర్స్ మా షాప్ కి వస్తాయని కూడా సరదాగా వ్యాఖ్యానించారు. దానికి రాహుల్ కూడా నవ్వేశారు. పైగా రాహుల్ కి తమ దుకాణం సొంత దుకాణం లాంటిది అని మీడియాకు సుశాంత్ జైన్ చెప్పారు. రాహుల్ ని ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా అభివర్ణించారు. రాహుల్ పెళ్ళి కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది అని కూడా జైన్ అనడం విశేషం.

రాహుల్ ట్వీట్ :

ఇక తాను స్వీట్ దుకాణానికి వెళ్ళడం అక్కడ స్వయంగా రెండు స్వీట్లు తయారు చేయడం మీద రాహుల్ ఎక్స్ వేదికగా తన అభిమానులతో ఆ విశేషాలను పంచుకున్నారు. ఢిల్లీలోని సుప్రసిద్ధమైనది ఘంటేవాలా స్వీట్ షాప్ అని ఆయన చెప్పారు. అక్కడ తాను ఇమర్తి బేసన్ లడ్డూలను తయారు చేయడానికి ప్రయత్నించాను అని చెప్పారు. శతాబ్దాల నాటి ఈ దుకాణం తీపిదనం నేటికీ స్వచ్ఛంగా సంప్రదాయబద్ధంగా ఉందని అదే హృదయానికి హత్తుకుంటోంది అని రాహుల్ ఎక్స్ లో పేర్కొన్నారు.

ఇంతకీ పెళ్ళెప్పుడు :

రాహుల్ గాంధీ పెళ్ళి ఎపుడు అన్నది సదరు దుకాణందారుడికే కాదు దేశమందరికీ ప్రశ్నగానే ఉంది. జవాబు అయితే రాహుల్ చెప్పడం లేదు. ఆయన తరచూ విశ్వవిద్యాలయాలకు వెళ్తారు, అక్కడ ఉన్న విద్యార్ధినీ విద్యార్ధులతో ముచ్చటిస్తారు. వారు వేసే మొదటి ప్రశ్న కూడా ఇదే. రాహుల్ జీ మీ పెళ్ళి ఎపుడూ అని. దానికి రాహుల్ ఒక్కోసారి డైరెక్ట్ గా బదులిస్తారు. చేసుకుంటే మీ అందరికీ చెబుతాను అని. మరోసారి దాటవేస్తారు. మొత్తానికి రాహుల్ కి పెళ్ళి చేసుకునే ఆలోచన ఉందా లేదా అన్నది కాంగ్రెస్ వర్గాలకే అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా 55 ఏళ్ళ వయసు నిండిన రాహుల్ గాంధీ పెళ్ళి చేసుకుంటే అది అతి పెద్ద వార్తగా రికార్డులు క్రియేట్ చేస్తుందన్నది వాస్తవం. సోషల్ మీడియా అయితే దద్దరిల్లి పోయేంతగా వైరల్ అవుతుంది. మరి ఆ న్యూస్ వినే రోజు దగ్గరలో ఉందా లేక దూరంగా ఉందా లేక అసలు లేదా ఏమో కాలమే జవాబు చెప్పాలి మరి.


Full View


Tags:    

Similar News