• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాహుల్ గాంధీ ఫోన్...

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ కలకలం.. "ఆధారాలున్నాయి" అంటూ ప్రధాని మోదీకి సవాల్!

| తన ఫోన్ సంభాషణలను కేంద్రం రహస్యంగా వింటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని, ఈ అంశంపై ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ’ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

By - Tupaki Political Desk
Update: 2026-11-13 11:37 GMT

కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటల దాడి పెంచారు. తన ఫోన్ సంభాషణలను కేంద్ర పెద్దలు రహస్యంగా వింటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగుకు సంబంధించి పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నానని వెల్లడించారు. ఈ విషయమై ప్రధాని మోదీతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రధాని తన సవాల్ ను స్వీకరిస్తారా? అంటూ చాలెంజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ‘ఆస్క్ మీ’ అనే కార్యక్రమంలో రాహుల్ నెటిజన్లతో సంభాషించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రాహుల్ దేశ భద్రతపై తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీ శక్తులు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు అంటూ రాహుల్ చేసిన హాట్ కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారని, కదలికలపై నిఘా పెట్టారని ఆరోపిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తన ఫోన్ ట్యాప్ అవుతోందని, అయినా తాను దేనికీ భయపడనని స్పష్టం చేశారు.తాను దాచుకోవడానికి తన దగ్గర ఏమీ లేదని, తాను ఎప్పుడూ నిజం వైపే నిలబడ్డానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గతంలో 'పెగాసస్'స్పైవేర్ వివాదం దేశ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనూ తనతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని రాహుల్ ఆరోపించారు. ఇప్పుడు మరోసారి నేరుగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత దశాబ్ద కాలంగా ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో విధానాలు, అవినీతి, వ్యక్తిగత విమర్శల చుట్టూ తిరిగిన ఈ రాజకీయం, నేడు డిజిటల్ భద్రత, టెక్నాలజీ ఆధిపత్యం వైపు మళ్లిందనడానికి ఈ ఘటనే నిదర్శనం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో పాటు సాంకేతికతను కూడా ప్రతిపక్షాలపై ఆయుధంగా వాడుకుంటోందనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం రాహుల్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

మరోవైపు, ప్రభుత్వంపై నిఘా ఆరోపణలు చేస్తూనే, అదే డిజిటల్ వేదికను తనకు అనుకూలంగా మలచుకోవడంలో రాహుల్ గాంధీ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ప్రధాన మీడియాలో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావిస్తున్న కాంగ్రెస్, నేరుగా ప్రజల చేతుల్లోని స్మార్ట్‌ఫోన్లనే తమ ప్రచార వేదికలుగా మార్చుకుంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, 'ఎక్స్' వేదికలుగా రాహుల్ చేస్తున్న వినూత్న ప్రయోగాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. ట్రక్కు డ్రైవర్లతో ప్రయాణం, రైతులతో కలిసి పొలం పనులు, మెకానిక్‌లతో ముచ్చట్లు, వంట చేయడం వంటి వీడియోలతో తన పాత ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకుని సామాన్యులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఆర్థికవేత్తలు, సామాజిక నిపుణులతో పాడ్‌కాస్ట్ తరహా లోతైన చర్చలు నిర్వహిస్తూ మేధావి వర్గాన్ని ఆకర్షిస్తున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఏకపక్ష ఆధిపత్యం చెలాయించిన బీజేపీ ఐటీ విభాగానికి, నేడు రాహుల్ గాంధీ డిజిటల్ టీమ్ గట్టి పోటీ ఇస్తోందని తాజా ఘటనల ద్వారా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Tags:    
  • rahulgandhi 
  • pmmodi 
  • phonetapping 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS