నాపైన దాడి కుట్ర అతనిదే...రఘురామ బిగ్ ట్విస్ట్

తన మీద ఇస్మాయిల్, రాజేష్ ఖనాన్, మీసాల రాజు హింసకు ప్రేరేపించారు అని రఘురామ క్రిష్ణం రాజు ఆరోపిస్తున్నారు.;

Update: 2026-04-01 18:26 GMT

శ్రీరామ నవమి రోజు అంటే మార్చి 27న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులోని శ్రీరామ ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్ళారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఆయన పైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రఘురామ తో పాటు పలువురు కూటమి నేతల మీద కూడా దాడి జరిగింది. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. క్షణాలలో అది వైరల్ గా మారింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ మీద దాడి అంటే మామూలు విషయం అయితే కాదు కదా. దాంతో సోషల్ మీడియా మెయిన్ స్ట్రీం మీడియా హోరెత్తింది. మరి ఆయన మీద ఎవరు దాడికి పాల్పడి ఉంటారు సూత్రధారులు ఎవరు అన్న చర్చ అయితే ఉంది. కానీ రఘురామ తనపైన దాడికి తెర వెనక సూత్రధారులు ఉన్నారని చెబుతూ ఆయనేనని ఒక పేరుని చెప్పడం ఇపుడు సంచలనం రేపుతోంది.

హింసకు ప్రేరేపించారు :

తన మీద ఇస్మాయిల్, రాజేష్ ఖనాన్, మీసాల రాజు హింసకు ప్రేరేపించారు అని రఘురామ క్రిష్ణం రాజు ఆరోపిస్తున్నారు. ఇస్మాయిల్ అన్న ఆయన చర్చిని నడుపుతున్నాడని అతనితో పాటు ఆ ఇద్దరూ చేరి ఈ దాడికి స్కెచ్ గీశారని రఘురామ అంటున్నారు. స్థానికంగా ఆలయం కట్టుకుంటే ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు. అయితే స్థానికంగా ఉన్న కుర్రాళ్ళను హింసకు ప్రేరేపించేలా చేసి బ్రెయిన్ వాష్ చేసింది ఈ ముగ్గురే అని రఘురామ అన్నారు.

పీవీ సునీల్ తో :

ఇక ఈ కేసులో మరో లింక్ ఉందని రఘురామ అంటున్నారు. ఈ ముగ్గురి కాల్ డేటా చూస్తే కనుక వారు మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ తో ఫోన్ లో ఎక్కువ సార్లు మాట్లాడారు అన్నది సమాచారం ఉందని రఘురామ క్రిష్ణం రాజు చెప్పడం విశేషం. కాల్ డేటా మొత్తం తీస్తే వీరి కుట్ర బయటపడుతుందని రఘురామ అంటున్నారు. దాడి చేసిన వారిని ప్రేరేపించిన వారిని అసలు వదిలే ప్రసక్తి లేదని రఘురామ స్పష్టం చేశారు. రామాలయం ఉన్న ప్లేస్ లో రామాలయం తిరిగి కడితే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. ఇలా అభ్యంతరం వ్యక్తం చేయడమేంటని ఫైర్ అయ్యారు.

పట్టు బిగించి మరీ :

తన మీద జరిగిన దాడిని చాలా ప్రతిష్టగా తీసుకున్నారు రఘురామ క్రిష్ణం రాజు. ఈ కేసులో పాత్ర ధారులనే కాదు సూత్ర ధారులను వదిలేది లేదని ఆయన అంటున్నారు. ఎవరు ఉన్నా కాల్ డేటా సాయంతో ముందుకు రప్పించి తీరుతామని అన్నారు. వారంతా దొరికేస్తారు అని ఆయన ధీమాగా చెప్పారు. మొత్తం మీద చూస్తే ట్రిపుల్ ఆర్ పట్టుదల మీద ఉన్నారు. మరి రఘురామ చేసిన ఈ కామెంట్స్ మీద అవతల వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News