చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించిన పీవీ సునీల్ ?

పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి. ఆయన ఇపుడు మీడియాలో చాలా ఎక్కువగా ఉంటున్నారు. అనేక అంశాల మీద ఆయన మాట్లాడుతున్నారు.;

Update: 2026-05-08 06:05 GMT

పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి. ఆయన ఇపుడు మీడియాలో చాలా ఎక్కువగా ఉంటున్నారు. అనేక అంశాల మీద ఆయన మాట్లాడుతున్నారు. వీటన్నింటినీ పక్కన పెడితే ఆయనకూ ఉప సభాపతి రఘురామక్రిష్ణంరాజుకు మధ్యన ఒక రకమైన వార్ సాగుతోంది. అది ఈనాటిది కాదు వైసీపీలో రెబెల్ ఎంపీగా రఘురామ ఉన్నప్పుడు ఆయనను గుంటూరు దాకా తీసుకుని వచ్చిన సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అని చెబుతారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేసిన సీఐడీ తనను పోలీస్ కస్టడీలో చిత్ర హింసలు పెట్టింది అని రఘురామ గత నాలుగేళ్ళుగా ఆరోపిస్తూనే ఉన్నారు. దీని మీద కేసులు కూడా నడుస్తున్నాయి.

వార్ కంటిన్యూ :

ఈ క్రమంలో ఆకివీడులోని రామాలయం నిర్మాణం ఇష్యూలో మళ్ళీ ఇద్దరి మధ్యన వార్ సాగుతోంది. అక్కడ గొంతాలమ్మ అమ్మ వారి కోవెల ఉందని పీవీ సునీల్ కుమార్ అంటే ఏ ఆలయమూ లేదని చెబుతూ రామాలయ నిర్మాణానికి రఘురామ పూనుకున్నారు. ఒక ఈ ఇద్దరూ ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్ లో క్రాస్ ఫైర్ లో పాల్గొని ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకున్నారు. అంతే కాదు మీడియా ముఖంగా కూడా తరచూ ఈ ఇద్దరి మధ్యన డైలాగ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఇలా వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సునీల్ కూడా లేటెస్ట్ గా ఒక వీడియో బైట్ రిలీజ్ చేస్తూ అందులో రఘురామను విమర్శించారు.

రఘురామ తప్పుడు ఆరోపణలు :

తనను వైసీపీ హయాంలో జగన్ సీఐడీ చీఫ్ నుంచి వేరే స్థానానికి బదిలీ చేయడం వెనక అగ్రి గోల్డ్ లో ఏదో చేశానని ఉప సభాపతి రఘురామ విమర్శలు చేయడం పట్ల సునీల్ కుమార్ మండిపడ్డారు. దానికి ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేయవద్దు అని ఆయన రఘురామకు సూచించారు. తన బదిలీ వెనకాల వేరే కారణాలు ఉన్నాయని అవి అంతర్గతమని బయటకు చెప్పడం బాగోదని ఆయన అన్నారు.

బాబు అరెస్ట్ వ్యవహారంలో :

ఇక తాను సీఐడీ చీఫ్ గా ఉన్నపుడే చంద్రబాబు విషయంలో స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు సాగుతోందని, అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలోనూ కేసులు ఉన్నాయని అన్నారు. వాటి విషయంలో ముందుకు వెళ్ళేందుకు సబబు కాదని తనకు అనిపించిందని అన్నారు. ఇక తాను డీజీపీ పోస్టు కోసం ఏ ప్రయత్నం చేయలేదని ఆయన చెప్పారు.ఇక తన బదిలీ తరువాతనే బాబు అరెస్ట్ జరిగిందని అలాగే మార్గదర్శి కేసులో దాడులు జరిగాయని చెప్పారు. విషయం ఈ విధంగా ఉంటే తనను జగన్ బదీలీ చేయడం వెనక అగ్రి గోల్డ్ లావాదేవీలు ఉన్నాయని రఘురామ అనడం పూర్తిగా అవాస్తవం అని సునీల్ అన్నారు.

డోర్స్ క్లోజ్ అయిపోయాయి :

వైసీపీ అధినేత జగన్ ని ప్రసన్నం చేసుకునే క్రమంలో రఘురామ తనను అడ్డం పెట్టుకుంటున్నట్లుగా ఉందని సునీల్ అన్నారు. ఎన్ని రకాలుగా చేసినా రఘురామకు అన్ని చోట్లా డోర్స్ క్లోజ్ అయిపోయాయని పీవీ సునీల్ కుమార్ చెప్పడం విశేషం. ఆయనకు క్రెడిబిలిటీ లేదని ఆయన ఏమి చెప్పినా ఎవరూ నమ్మేది లేదని అన్నారు. పదే పదే అవాస్తవాలు ప్రచారం చేసినా ఎవరేమిటన్నది అందరికీ తెలిసిందే అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే బాబు అరెస్టు విషయంలో నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ వ్యతిరేకించారా ఆ కారణం వల్లనే ఆయన్ను ఆ పదవి నుంచి ట్రాన్స్ ఫర్ చేశారా అన్న కొత్త చర్చకు ఆయనే ఆస్కారం కల్పించారు.

నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు :

బాబు అరెస్టు విషయం తనకు సబబు అనిపించలేదని ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు తన బదిలీ ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు అని చెప్పడం తాను బదిలీ అయిన వెంటనే బాబు అరెస్టు జరిగిందని ఎత్తి చూపడం ఇవన్నీ చూస్తూంటే పీవీ సునీల్ వైసీపీ హయాంలో బాబు అరెస్ట్ విషయం మీద సీఐడీ చీఫ్ హోదాలో వ్యతిరేకించారా అన్న చర్చ సాగుతోంది. మరి అంతర్గత విషయాలు చెప్పడం బాగోదు అని పీవీ సునీల్ అంటూనే కొన్ని హింట్స్ ఇచ్చారు. దానిని బట్టి తెర వెనక అప్పట్లో ఏమి జరిగి ఉండొచ్చు అని ఎవరికి వారే ఊహిస్తున్నారు.

Tags:    

Similar News