బ్రదర్ ఆఫ్ జగన్ ... పులివెందుల ఆపరేషన్
దుష్యంత్ రెడ్డికి పులివెందుల లో మంచి పట్టు ఉంది. స్థానికుడు కావడంతో పార్టీలో కూడా అవకాశం ఇస్తే చక్రం తిప్పగలరని అధినాయకత్వం బలంగా నమ్ముతోంది.;
వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా పార్టీ అంతర్గత విషయాల మీద దృష్టి సారించింది అని అంటున్నారు. వైసీపీకి కంచుకోటలు అన్నీ 2024 ఎన్నికల్లో కుదేల్ అయ్యాయి. పదికి పది ఎమ్మెల్యే సీట్లను 2019లో గెలుచుకున్న వైసీపీకి 2024లో మాత్రం చుక్కలు కనిపించాయి. కేవలం మూడంటే మూడు సీట్లు దక్కాయి. దాంతో ఫ్యాన్ పార్టీకి భారీ షాక్ తగిలింది అనుకుంటే తాజాగా జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏకంగా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అని అంటున్నారు. దాంతో నాటి నుంచే వైసీపీ హైకమాండ్ కొత్త ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు.
అవినాష్ వల్ల కాదా :
పులివెందులలో వైసీపీ పట్టు సడలుతోంది అని వైసీపీ పెద్దలకు బాగా అర్ధం అయింది అని అంటున్నారు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నా పులివెందుల మీద సీరియస్ గా ఫోకస్ పెట్టలేకపోతున్నారు అని ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు అని చెబుతున్నారు. వైఎస్ జగన్ కి మరో తమ్ముడు అయిన వైఎస్ దుష్యంత్ రెడ్డిని ఇపుడు రంగంలోకి తీసుకుని వస్తున్నారు అని అంటున్నారు. అయితే ఆయన వైసీపీ రాజకీయాలకు కొత్త కాదు అని అంటున్నారు. గతంలో ఎన్నికలు జరిగినపుడు ఆయన పార్టీ కోసం పనిచేశారు. ఇపుడు ఆయనను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోకి తేబోతున్నారు అన్నది ప్రచారంలో ఉన్న మాట.
చైర్మన్ అభ్యర్ధిగా :
దుష్యంత్ రెడ్డికి పులివెందుల లో మంచి పట్టు ఉంది. స్థానికుడు కావడంతో పార్టీలో కూడా అవకాశం ఇస్తే చక్రం తిప్పగలరని అధినాయకత్వం బలంగా నమ్ముతోంది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. టీడీపీ కూటమి అయితే ఇప్పటికే పులివెందుల మునిసిపాలిటీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ అయిన బీటెక్ రవి సోదరుడిని అభ్యర్థిగా పోటీకి దించుతారు అని టాక్ నడుస్తోంది.
ఢీ కొట్టాలంటే :
ఈ నేపథ్యంలో వైసీపీ ఢీ కొట్టాలంటే బలమైన అభ్యర్ధి కావాలి. అది కూడా వైసీపీ సెంటిమెంట్ తో కూడుకుని ఉండాలి. అపుడే అధికార కూటమి మీద విజయం దక్కుతుందని లెక్క వేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ కి మరో తమ్ముడు అయిన వైఎస్ దుష్యంత్ రెడ్డిని రాజకీయ తెర మీదకు తెస్తున్నారు అని అంటున్నారు. ఆయనను పులివెందుల మున్సిపాలిటీ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించి ఇప్పటి నుంచే సమరానికి ప్రిపేర్ చేస్తారు అని అంటున్నారు.
ఎంపీ అభ్యర్ధిగా :
ఇక దుష్యంత్ రెడ్డిని పులివెందుల నుంచి రాజకీయంగా రాటు తేలేలా చేస్తే 2029 నాటికి కడప ఎంపీ అభ్యర్ధిగా కూడా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఆయన పులివెందుల టెస్ట్ లో పాస్ అయితే రానున్న రోజులలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్లేస్ లోకి వచ్చేలా చూడాలన్నదే వైసీపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. ఇక అవినాష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. హ్యాట్రిక్ ఎంపీగా ఉన్న అవినాష్ ని నాలుగవసారి కంటిన్యూ చేయరని అంటున్నారు.
వైసీపీని బాగా దెబ్బ తీసింది :
అంతే కాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయం 2024 ఎన్నికల్లో వైసీపీని బాగా దెబ్బ తీసింది. అయితే పంతానికి పోయి ఆయనకే టికెట్ ఇచ్చారు. గెలిచారు కూడా. అయితే కడపలో మొత్తం నష్టం జరిగింది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండానే మరో తమ్ముడిని ముందుగానే రెడీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి పులివెందులను కాచుకోవాల్సిన బాధ్యత బ్రదర్ ఆఫ్ జగన్ దుష్యంత్ రెడ్డి మీద ఉండబోతోందిట.