పులివెందుల గ్రౌండ్ రిపోర్ట్ : పధకాలా...విశ్వాసమా ?

ఏపీలో చాలా ప్రాంతాలకు ఒక విశేషం ఉంటుంది. ఆ పేరు చెప్పగానే చాలా గుర్తుకు వస్తాయి. అలా చూస్తే కనుక పులివెందుల పేరు చెప్పగానే వైఎస్సార్ కుటుంబం జ్ణప్తికి వస్తుంది.;

Update: 2025-08-06 21:30 GMT

ఏపీలో చాలా ప్రాంతాలకు ఒక విశేషం ఉంటుంది. ఆ పేరు చెప్పగానే చాలా గుర్తుకు వస్తాయి. అలా చూస్తే కనుక పులివెందుల పేరు చెప్పగానే వైఎస్సార్ కుటుంబం జ్ణప్తికి వస్తుంది. పులివెందులలో అర్ధ శతాబ్దంగా పాగా వేసిక ఏకైక కుటుంబంగా వైఎస్సార్ ఫ్యామిలీ ఉంది. కాలాలు ఎన్ని మారినా రాజకీయం ఎంత మారినా కూడా అక్కడ మాత్రం ఫలితం ఒకేలా ఉంటూ వస్తోంది. అయితే ఇపుడు కూడా అలాగే ఉందా అంటే గ్రౌండ్ రిపోర్ట్ ఏమి చెబుతుందో చూడాల్సిందే.

కుటుంబం పట్ల విశ్వాసం :

వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట పులివెందుల. పులివెందుల మొదటి నుంచి వైఎస్సార్ ఫ్యామిలీ వైపే ఉంది. ఆ కుటుంబం నుంచి ఎవరు అభ్యర్థి అయినా ఆదరిస్తోంది. అంతే కాదు వైఎస్సార్ బ్లడ్ అంటే ఇంకా ఎక్కువగా అక్కున చేర్చుకుంటోంది. అయితే ఈసారి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈసారి వైఎస్సార్ ఫ్యామిలీ వైపు ఓటర్ల విశ్వాసం ఎంత మేరకు ఉంది అన్నదే చర్చగా ఉంది.

ఢీ కొడుతున్న టీడీపీ :

ఒక అతి చిన్న ఎన్నిక మీద టీడీపీ పూర్తి ఫోకస్ పెట్టింది. ఎందుకు అంటే పులివెందుల జగన్ సొంత ఇలాకా కాబట్టి. అందుకే కేవలం పదివేల ఓటర్లు మాత్రమే ఉన్న చోట భారీ ఎత్తున రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ప్రతీ ఓటునూ ఓడిపట్టుకోవాలని టీడీపీ చూస్తోంది. వైసీపీ సానుభూతి గ్రామాల మీద వల వేస్తోంది. అధికార పార్టీకు అన్ని రకాలుగా ఉన్న అడ్వాంటేజెస్ ని వాడుకుంటోంది నిన్నటి దాకా వైసీపీకే ఓటేసిన కుటుంబాలను తమ వైపు తిప్పుకుంటోంది.

పధకాలతోనే పంట :

ఏపీలో చూస్తే మరో నాలుగేళ్ళ పాటు టీడీపీ కూటమి చేతిలో అధికారం ఉంది. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వం అందించే పధకాల మీద అంతా ఆసక్తిగా చూస్తారు. అందుకే పధకాలనే ఆసరాగా చేసుకుని మరీ టీడీపీ రాజకీయ వ్యూహం రచిస్తోంది. తమ పధకాలను అందుకుంటున్న వారు ఓటేయాలని అంటోంది. దాంతో జనాలలో ఒక డైలమా అయితే ఏర్పడింది అని అంటున్నారు ఓటు వేయకపోతే తమకు పధకాలు కట్ చేస్తారేమో అన్న భయం అయితే జనాల్లో బయల్దేరింది అని అంటున్నారు.

ఖండిస్తున్న వైసీపీ :

పధకాల పేరు చెప్పి ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పులివెందుల రూరల్ పరిధి అంతా జెడ్పీటీసీగా ఉంది. రూరల్ అంటేనే వైసీపీకి కంచుకోట. అయితే అలాంటి చోట ఇపుడు గ్రమాలుగా విభజించి మరీ టీడీపీ చేస్తున్న రాజకీయానికి వైసీపీ ధీటుగా జవాబు చెబుతుందా లేదా అన్నదే చర్చగా ఉంది. టీడీపీ అయితే నేరుగా ప్రతీ ఇంటినీ యూనిట్ గా చేసుకుని రాజకీయ జోరు సాగిస్తోంది. కూటమి వైపు ఉండాలని ఓటేయాలని జనాలను కోరుతోంది. ఇక వైసీపీ సానుభూతిపరుల మీద బైండోవర్ కేసులు పెడుతున్నారు అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అధికార దుర్వినియోగం చేస్తున్నారు అని కూడా వారు ఫైర్ అవుతున్నారు.

విశ్వాసం వీగుతుందా :

రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్నది అందరికీ తెలిసిందే. దాంతో ఏళ్ళ తరబడి కాంగ్రెస్ కి అలాగే వైసీపీకి ఓట్లు వేసిన ఓటర్లు కాస్తా ఇటు వైపు షిఫ్ట్ అవుతారా అన్న చర్చ అయితే ఉంది. పధకాల విషయంలో కానీ ఇంకా మరేదైనా కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ కుటుంబం మీద విశ్వాసం వీగితే మాత్రం అనూహ్యమైన సంచలనమైన ఫలితమే వెలువడుతుంది అని అంటున్నారు. పులివెందులలో కనుక వైసీపీని ఓడిస్తే అది తమకు భారీ రాజకీయ విజయంగా టీడీపీ భావిస్తుంది అనడంలో సందేహమే లేదు అంటున్నారు. దీంతో పధకాలా విశ్వాసమా అన్నదే బిగ్ డిబేట్ గా మారింది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News