ప్రొఫెసర్ ఎపిసోడ్ కంటిన్యూ...పవన్ మీద హాట్ కామెంట్స్ !
ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక యూ ట్యూబ్ చానల్ లో చేసిన విశ్లేషణ దానికి జనసేన ఆగ్రహం ఇవన్నీ కొద్ది రోజులుగా మీడియా సంచలనాలుగానే నమోదు అవుతున్నాయి.
ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక యూ ట్యూబ్ చానల్ లో చేసిన విశ్లేషణ దానికి జనసేన ఆగ్రహం ఇవన్నీ కొద్ది రోజులుగా మీడియా సంచలనాలుగానే నమోదు అవుతున్నాయి. ఇక ప్రొఫెసర్ మీద అయితే కాకినాడలో ఒక కేసు ఫైల్ అయింది. మరి ఎన్ని కేసులు ఎక్కడ పెట్టారో తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా రాజమండ్రిలో జరిగిన పార్టీ మీటింగులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ అరెస్టుని తాను వద్దు అనే చెప్పాను అన్నారు. ఆయనంటే ఇష్టం ఉందని చెప్పారు. మరో వైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తెలంగాణా డీజీపీ ని కలసి వస్తూ అరెస్టు గురించి తనకు ఏదీ సమాచారం లేదని చెప్పారు. దాంతో పాటు తన వ్యాఖ్యలు ఉప సంహరించుకున్నాక ఇక కొత్తగా తెరవడం ఎందుకు అని చెప్పారు. దాంతో ఎండ్ కార్డు పడింది అని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే మ్యాటర్ మొత్తం బిగ్ ట్విస్ట్ ఇచ్చుకుంది.
రౌండ్ టేబిల్ సమావేశంలో :
ఇక లేటెస్ట్ గా హైదరాబాద్ లో రౌండ్ టేబిల్ సమావేశం పెట్టి తెలంగాణా మేధావులు జర్నలిస్టులు ప్రజా సంఘాల నేతలు అంతా కలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్ కి మద్దతు గా నిలిచారు. ఈ సందర్భంగా వారు చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే పవన్ని గట్టిగానే టార్గెట్ చేసినట్లుగా అనిపించాయి. పవన్ వ్యక్తిగత జీవితం గురించి కూడా సీనియర్ పాత్రికేయుడు ఒకరు లేవనెత్తారు. పవన్ ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు అన్నారు. చెగువేరా నుంచి నుంచి ఆయన రాజకీయం ఎన్నో మలుపులు తిరిగి ఇపుడు చంద్రబాబు చుట్టూ తిరుగుతోందని కూడా హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్చ అన్నది ఉందని గుర్తు చేశారు. దానిని అణచాలనుకుంటే ఊరుకోమని చెప్పారు. ఇక పబ్లిక్ లైఫ్ లోకి వస్తే ఎవరినైనా ఏమైనా అంటామని కూడా అన్నారు.
ఆంధ్రా పెత్తనం అంటూ :
ఇక పాత్రికేయ లోకంలో కూడా ఆంధ్రా పెత్తనమే ఉందని కూడా పలువురు అన్నారు. ఆఖరుకు ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్ కార్డుల విషయంలోనూ వివక్ష ఉందని అన్నారు. ఇంకో వైపు చంద్రబాబుని కూడా వదలలేదు. ఆయన ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు అని విమర్శించారు. ఆంధ్రా వారు అంతా హైదరాబాద్ లో ఉంటూ మళ్ళీ మాపైన దాడులా అని కూడా ఆగ్రహించారు.
ప్రాణం పోయినా తగ్గను :
ఇంకో వైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ అయితే తన ప్రాణం పోయినా తగ్గేది లేదని అన్నారు. మాట తప్పను అని కూడా అన్నారు. తాను ఏమి అనలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అని అయినా కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఎఫ్ ఐ ఆర్ లో రాశారు అని ఆయన ఆగ్రహించారు. తాను 30 ఏళ్ళ వయసులోనే అరెస్టులకు భయపడలేదని 62 ఏళ్ళ వయసులో ఎందుకు తగ్గుతాను అని నాగేశ్వర్ అన్నారు. తనను ఎక్కడైనా అరెస్టు చేసుకోవచ్చు అని తానే ముందుకు వస్తాను అని కూడా అన్నారు. తన కులం ఏమైనా పోరాటం మాత్రం అణగారిన వర్గాల కోసమే చేస్తూ వచ్చాను అని నాగేశ్వర్ చెప్పారు. ప్రభుత్వమే కేసులు పెట్టవచ్చ అణచివేతలకు పాల్పడవచ్చా అని నాగేశ్వర్ ప్రశ్నించారు రాజ్యమే ఇలా చేస్తే పౌరుల సంగతేంటి అంటూ ఒక లాజిక్ పాయింట్ నే ఆయన తీశారు.
పీక్స్ చేరుకుందా :
ఇవనీ చూస్తూంటే వివాదం పీక్స్ కి చేరుకుందా అన్న చర్చ వస్తోంది. ఎందుకంటే నాగేశ్వర్ ని అరెస్ట్ చేస్తే ఉధ్యమిస్తామని చెబుతున్నారు. ఇంకో వైపు ఆంధ్రా వారు తెలంగాణా వారిని ఎలా అరెస్టు చేస్తారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వ్యవ్హారం చూస్తే ముదిరినట్లుగానే ఉంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి, ఎండ్ కార్డు ఎపుడు పడుతుంది అంటే చెప్పడం కష్టమే. విషయం ఒకటి అయినా చాలా అంశాలు ముడిపడిపోతున్నట్లుగా ఇపుడు కనిపిస్తోంది. దాంతో పాటుగా పవన్ ని గట్టిగానే టార్గెట్ చేశారు అని అంటున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారు అన్న దాకా వ్యాఖ్యలు వెళ్తున్నాయంటే రానున్న రోజులలో ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.