• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రియాచౌదరీని ఇకపై మాస్క్...

ప్రియాచౌదరీని ఇకపై మాస్క్ లేకుండా చూడలేమా..?

| ప్రియాచౌదరి ఫ్యామిలీలో అంతా జేడీయూలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో భాగంగా... ఆమె తండ్రి వినోద్ కుమార్ చౌదరి.. జేడీయూ పార్టీ మాజీ శాసనసభ్యుడు కాగా.. ఆమె తాత ఉమాకాంత్ చౌదరీ.. నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితులు.

By - Raja Ch
Update: 2025-11-14 22:30 GMT

సాధారణంగా దేశంలో ఎన్నికల వేళ సవాళ్లు, ప్రతి సవాళ్లు. ప్రతిజ్ఞలు కామన్ అనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ సారి ఓటమి పాలైతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ఒకరంటే.. ఎన్నికల్లో గెలిచే వరకూ గడ్డం తీయనని మరొకరు.. ఇలా రకరకాల స్టేట్ మెంట్లు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఫ్లూరల్స్ పార్టీ చీఫ్ పుష్పమ్ ప్రియాచౌదరి వ్యవహారం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

అవును... బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది! మరోవైపు ఈ ఎన్నికల్లో గెలిచేవరకూ ఫేస్ మాస్క్ తీయనని చెప్పిన పుష్పమ్ ప్రియాచౌదరి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.

దర్భంగా నియోజకవర్గంలో పోటీ చేసిన ఆమె.. ఎనిమిదో స్థానానికి పరిమితమైన పరిస్థితి. దీంతో... ఆమె అన్నమాట ప్రకారం ఇకపై నిత్యం మాస్క్ లోనే కనిపిస్తారా.. లేక, మాట తీసి గట్టున పెడతారా అనేది వేచి చూడాలి.

ఫ్యామిలీ అంతా జేడీయూలో.. ఆమె మాత్రం ప్రత్యేకం!:

ప్రియాచౌదరి ఫ్యామిలీలో అంతా జేడీయూలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో భాగంగా... ఆమె తండ్రి వినోద్ కుమార్ చౌదరి.. జేడీయూ పార్టీ మాజీ శాసనసభ్యుడు కాగా.. ఆమె తాత ఉమాకాంత్ చౌదరీ.. నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితులు. ఇదే క్రమంలో ఆమె అంకుల్ వినయ్ కుమార్ కూడా జేడీయూలోనే ఉన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బేణిపూర్ నుంచి గెలిచారు. అయితే ఈమె మాత్రం ప్రత్యేకంగా పార్టీని స్థాపించారు.

ఇందులో భాగంగా... 2020లో "ద ఫ్లూరల్స్ పార్టీ" ని స్థాపించిన ప్రియా చౌదరి.. విజిల్ గుర్తుపై 243 నియోజకవర్గాల్లో బరిలో నిలిచారు. రెగ్యులర్ గా బ్లాక్ డ్రెస్, బ్లాక్ మాస్క్ లో కనిపించే ఆమె.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతే మాస్క్ తీస్తానని ప్రతిజ్ఞ చేశారు! 2020 ఎన్నికల్లోనూ ఆమె పార్టీ నుంచి 148 స్థానాల్లో పోటీ చేసి, ఓటమి పాలయ్యారు.

ఎనిమిదో స్థానానికి పరిమితం!:

బీహార్ లోని దర్భంగా స్థానం నుంచి ప్రియాచౌదరి పోటీ చేశారు. అయితే ఈ స్థానం నుంచి బీజేపీకి చెందిన సంజయ్ సరోగి 97,453 ఓట్లతో విజయం సాధించగా... ఆ తర్వాత స్థానంలో వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ఉమేష్ సహానీ 72,860 ఓట్లతో నిలిచారు. ఇక.. ప్రియాచౌదరి కేవలం 1,403 ఓట్లతో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు!

Tags:    
  • priyachaudhary 
  • biharelections2025 
  • darbhanga 
  • maskpledge 
  • telugunews 
  • theflorals 
  • nda 

Similar News

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

Copyright @2026

Powered by Blink CMS