ఛీ.. ఛీ.. పవన్ పై పడిపోయిన ప్రకాష్ రాజ్!

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ పవన్‌ను తీవ్రంగా విమర్శించారు.;

Update: 2025-07-12 05:08 GMT

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. "మన మాతృభాష అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ" అని ఆయన చేసిన వ్యాఖ్య దక్షిణాదిన తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. గతంలో "హిందీ గో బ్యాక్" అంటూ నినదించిన పవన్ ఇప్పుడు హిందీ గొప్పతనాన్ని గుండెతట్టిపడేలా చెప్పడం ప్రజలను, విశ్లేషకులను, ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేసిందని విమర్శిస్తున్నారు..

- సోషల్ మీడియాలో పవన్‌కి ఎదురుదెబ్బ

పవన్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. #POLITICALJOKERPK అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతూ, ఆయనపై వ్యంగ్య వ్యాఖ్యలతో నిండిపోయింది. కేవలం కొన్ని గంటల్లోనే పదిలక్షలకు పైగా ట్వీట్లు, పోస్టులు, వీడియోలు వైరల్ అయ్యాయి. జనసేన సోషల్ మీడియా వింగ్ ఆయన వ్యాఖ్యలను సమర్థించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది.

- ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందన

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ పవన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆయన తన ఎక్స్‌ అకౌంట్‌లో "ఈ range కి అమ్ముకోవడమా…. ఛీ ఛీ… #justasking" అంటూ ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యకు వేలాదిమంది మద్దతు తెలిపి ప్రకాశ్ రాజ్ పోస్టును షేర్ చేస్తున్నారు.

- గతంలో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు బూమరాంగ్

పవన్ కళ్యాణ్ గతంలో హిందీకి వ్యతిరేకంగా తీసుకున్న వైఖరి ఇప్పుడు ఆయనను తానే తినేలా చేస్తోంది. హిందీ గో బ్యాక్ అంటూ ఆయన ప్రచారం చేసిన వీడియోలు, పాత ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడేమో కేంద్ర బీజేపీకి మద్దతుగా హిందీకి ప్రమోషన్ ఇస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.

- హిందీ మింగేసిన భాషల విషాదగాథ

హిందీ వలన ఎన్నో స్థానిక భాషలు కనుమరుగయ్యాయన్న ఆందోళన గతకొన్నేళ్లుగా వ్యక్తమవుతోంది. భోజ్‌పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌ వంటి 29 స్థానిక భాషలు హిందీ ప్రభావంలో నశించిపోయాయని భాషావేత్తలు చెబుతున్నారు. బీఆర్ అంబేడ్కర్ కూడా అప్పట్లో "ఒకే భాషకి విస్తారమైన ప్రాధాన్యం ఇవ్వడం ప్రమాదకరం" అని హెచ్చరించారు.

భాష అనేది భావాలను, సంస్కృతిని ప్రతిబింబించే సాధనం. దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రజాస్వామిక విలువలకు విరుద్ధం. పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాప్రతినిధులు మాట్లాడే మాటలు బాధ్యతాయుతంగా ఉండాలి. ఒకప్పుడు హిందీ వ్యతిరేకి అయిన వ్యక్తి ఇప్పుడు హిందీకి మద్దతుగా మాట్లాడడమే కాకుండా దానిని ‘పెద్దమ్మ’గా పోల్చడం దక్షిణాదివాసులకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు.

భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం భాషా సున్నితతతో ఆడుకోవడం ఆపాలని పలువురు కోరుతున్నారు. ఏకత్వం అవసరమే కానీ, అది బలవంతపు భాషా మేలు ద్వారా కాదు.. పరస్పర గౌరవం ద్వారా సాధ్యమవుతుంది.

Tags:    

Similar News