పోస్టల్ శకునం ఎవరికి శుభ సూచకం ?

గతసారి అంటే 2019లో 2 లక్షల 95 దాకా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగితే ఈసారి ఆ సంఖ్య కాస్తా ఈసారికి 4 లక్షల 44 వేల ఓట్లకు పై దాటింది.

Update: 2024-05-22 17:19 GMT

కౌంటింగ్ ప్రక్రియలో ఎపుడూ మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఈసారి అలాగే జరుగుతుందని అంటున్నారు. ఏపీలో చూస్తే ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. చాలా జిల్లాలలో నూటికి నూరు శాతం పోలింగ్ జరిగింది. గతసారి అంటే 2019లో 2 లక్షల 95 దాకా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగితే ఈసారి ఆ సంఖ్య కాస్తా ఈసారికి 4 లక్షల 44 వేల ఓట్లకు పై దాటింది.

గతసారి పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువ ఓట్లు వైసీపీకి దక్కాలి. ఆ తరువాత ప్లేస్ లో టీడీపీ ఉంది. వైసీపీకి ఆనాడు ఒక లక్షా 36 వేల 768 ఓట్లు వస్తే టీడీపీకి 81 వేల 608 ఓట్లు లభించాయి. ఈసారి చూస్తే భారీ పోలింగ్ జరిగింది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ లో తొంబై శాతానికి పైగా టీడీపీ కూటమికే అని కూటమి నేతలు చెబుతున్నారు.

అయితే అలా ఎలా జరుగుతుంది ఈసారి ఉద్యోగులు పెద్ద ఎత్తున పెరిగారు అందులో జగన్ నియామకాలు చేసిన కొత్తగా సృష్టించినా సచివాలయ ఉద్యోగులు లక్షా పాతిక వేలు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఆర్టీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల మరో యాభై వేల మంది సిబ్బంది ఓట్లు వైసీపీకి అనుకూలం అవుతాయని వారు అంటున్నారు. అలా లెక్క వేసుకుంటే రెండు లక్షల ఓట్లు తక్కువ కాకుండా వైసీపీకి రావచ్చు అన్నది ఆ పార్టీ నేతల అంచనా.

అయితే టీడీపీ కూటమి తమకు నాలుగు లక్షల దాకా ఓట్లు వస్తాయని ఆశలు పెట్టుకుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఈసారి హోరా హోరీ పోరు సాగుతుంది, మెజారిటీలు కూడా వందలు పదులలో ఉన్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు. దాంతో అపుడు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అపర సంజీవిని మాదిరిగా కాపాడుతాయని అంటున్నారు.

Read more!

అయితే మొదట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చూస్తారు. కౌంటింగ్ లో లెక్క పెడతారు. దాంతో కౌంటింగ్ లో ఏ పార్టీకి అనుకూలం ఉంది. గాలి ఏ వైపు వీచింది అన్నది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచే వెల్లడి అవుతుందని అంటున్నారు.

గతసారి చూస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచే వైసీపీకి పాజిటివ్ ట్రెండ్స్ స్టార్ట్ అయ్యాయి. అలా వైసీపీ వచ్చేస్తోంది అన్న ఊపు గట్టిగా కనిపించింది అని అంటున్నారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉంటుందా అన్నది ఒక చర్చగా ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తో శుభ శకునాలు ఎవరికి ఎదురైతే వారిదే విజయం అని అంటున్నారు.

దానికి గతంలో లెక్కించిన ఓట్లు వాటి వివరాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికలు సైతం పోస్టల్ బ్యాలెట్ ని బట్టే ట్రెండింగ్స్ తెలిసాయని అవి అలా లాస్ట్ దాకా కంటిన్యూ అయ్యాయని చెబుతున్నారు. ఇపుడు కూడా అదే ఊపు ఉంటుందని టీడీపీ కూటమి ఆశపడుతోంది.

అయితే పోస్టల్ బ్యాలెట్ లో తక్కువ ఓట్లు వచ్చినా మిగిలిన ఓట్ల విషయంలో మెజారిటీలు మారిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా జూన్ 4న కౌంటింగ్ స్టార్ట్ అయ్యాక అందరూ టీవీలకు అతుక్కుపోయి టొలి ట్రెండ్స్ నే ఎక్కువగా చూస్తారు. కళ్ళప్పగించి మరీ వారు చూస్తారు. అలనటి టైం లో ట్రెండ్స్ అన్నీ ఏ పార్టీకి వెళ్తాయో వారిదే విజయం అని సంబరాలు మొదలెట్టే చాన్స్ ఉంది. సో పోస్టల్ బ్యాలెట్ శకునం ఎవరికి అనుకూలంలో చూడాలంటే ఇంకా జూన్ 4 వరకూ వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News