• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అదే జరిగితే వైసీపీ నుంచి...

అదే జరిగితే వైసీపీ నుంచి వెళ్లిపోతానంటున్న పోసాని!

| రచయిత, నటుడు, దర్శకుడు, ఏపీ ఎఫ్.డి.సీ. ఛైర్మన్ పోసాని కృష్ణమురళి స్టైల్ ఆఫ్ స్టేట్ మెంట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

By - Tupaki Desk
Update: 2024-02-20 08:24 GMT

రచయిత, నటుడు, దర్శకుడు, ఏపీ ఎఫ్.డి.సీ. ఛైర్మన్ పోసాని కృష్ణమురళి స్టైల్ ఆఫ్ స్టేట్ మెంట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వైఎస్ జగన్ వీరాభిమానుల్లో ఒకరిగా పేరున్న పోసాని.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జగన్ పథకాలపైనా.. చంద్రబాబు టాలెంట్ పైనా అసక్తికర వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... చంద్రబాబును తిట్టినవారే తర్వాత ఆయనతో స్నేహం చెస్తుంటారు.. చంద్రబాబు కూడా ఎవరినైతే బలంగా తిడతారో, ఎవరి పతనాన్ని కోరుకుంటారో.. తర్వాతి కాలంలో తిరిగి వారితోనే స్నేహం చేస్తుంటారని... ఇది డబ్బుల వల్ల జరుగుతుందా.. లేక, వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్ల సాధ్యమవుతుందా అనేది తనకు తెలియదని.. చంద్రబాబుకు నార్కో టెస్టు చేయిస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని.. అందుకు బాబు ఒప్పుకుని నిజాలే చెబితే ఆయన కోసం పాదయాత్ర కూడా చేస్తానని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో... జగన్ తన ఐదేళ్ల కాలంలో ఎన్నో అద్భుత పథకాలు ప్రవేశపెట్టారని తెలిపిన పోసాని... సీఎంగా ఆయన తన పదవీకాలంలో అవినీతి చేశారని ఏ పార్టీఇవారైనా ఆధారాలతో నిరూపిస్తే.. తనను చెప్పుతో కొట్టవచ్చు.. అంత నమ్మకం తనకు జగన్ అంటే అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో... జగన్ పథకాలు అందడం లేదని ఏ పార్టీవారైనా నిరూపిస్తే తాను కూడా ఆ పార్టీలోకి వెళ్లిపోతానని తెలిపారు పోసాని.

బీజేపీని ఓడించడానికి ఇతర రాష్ట్రాల్లో చంద్రబాబు వేల కోట్లు ఖర్చుపెట్టారనే విషయం పబ్లిక్ డొమైన్ లో ఉందని.. ఇప్పుడు తిరిగి బీజేపీతోనే జతకట్టబోతున్నారని... ఇక వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబే అయినా "సో వాట్" అంటూ పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబుకే ఓటు వేయాలని కోరడం వెనుక బాబుకు ఉన్న ఆ స్పెషల్ ట్యాలెంట్ ఏమిటని పోసాని ప్రశ్నించారు. ఇది డబ్బుతో సాధ్యమవుతుందా.. లేక, వ్యవస్థలను మ్యానేజ్ చేయడం ద్వారా వీలవుతుందా అని అడిగారు.

ఇదే సమయంలో... కాపులు రౌడీలు అని, చిరంజీవిది కాపుల పార్టీ అని గతంలో విపరీతంగా ఆయనను అవమానించారని తెలిపిన పోసాని... నందమూరి తారక రామరావు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు పార్టీలో కార్యకర్త కూడా కాదనే విషయం పబ్లిక్ డొమైన్ లో ఉందన్ని అన్నారు. సీఎం అవ్వడం కోసం ప్రపంచంలో లేని పథకాలు ప్రవేశపెడుతున్నారని చంద్రబాబుపై మండిపడిన పోసాని... ఎన్.టి. రామారావు పెట్టిన గొప్ప పథకాలను చంద్రబాబు సీఎం అయ్యాక నాశనం చేశారని తెలిపారు.

ఇదే ఫ్లో లో హెరిటేజ్ వ్యవహారాన్ని ప్రస్థావించిన పోసాని... తన భర్త జైలులో ఉండి కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నారని భువనేశ్వరి అంటున్నారని.. అయితే ఆరు నెలల్లో మోహన్ బాబు హెరిటేజ్ చంద్రబాబుకు ఎలా వచ్చేసిందో నార్కో టెస్ట్ పెట్టి ప్రశ్నలు అడిగితే తెలుస్తుందని అన్నారు! ఆ పరీక్షల్లో అన్నీ నిజాలు చెబితే కమ్మ ఓట్లన్నీ టీడీపీకే పడతాయని.. తాను అడిగిన ప్రశ్నలన్నింటికీ నిజమైన సమాధానాలు చెబితే జీవిత కాలం చంద్రబాబే ముఖ్యమంత్రి.. అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నార్కో టెస్టులో నిజాలు చెప్పి మగసీత లాగా బయటకు వస్తే.. కమ్మోడిగా చంద్రబాబు కోసం పాదయాత్ర చేస్తా.. నార్కో టెస్ట్ కు ఆర్ యూ రెడీ? ఐఎం రెడీ? అంటూ పోసాని కృష్ణ మురళి సవాల్ విసిరారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి!!

Tags:    
  • Posanikrishnamurali 
  • Ysrcp 
  • Tdp 
  • Chandrababunaidu 
  • Pawankalyan 
  • Jansena 
  • Allaince 
  • Bjp 
  • APelections 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS