పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. మరణానంతరం తొలి ఫోటో విడుదల!
క్రైస్తవ మత గురువు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవం పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.;
క్రైస్తవ మత గురువు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవం పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతరం వాటికన్ అధికారులు తొలి ఫోటోను విడుదల చేశారు.ఈ ఫోటోలో పోప్ ఫ్రాన్సిస్ ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉన్నారు.
వాటికన్ అధికారులు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు సంబంధించిన తేదీలను ఇంకా ప్రకటించలేదు. అయితే, శుక్రవారం లేదా ఆదివారం మధ్య అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ విశ్వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ మరణంపై వాటికన్ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ విశ్వాసులకు తీరని లోటని పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ తన జీవితకాంలో పేదలు, అనగారిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు. ఆయన బోధనలు, సందేశాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిని ఇచ్చాయి.
పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల వివిధ దేశాల అధినేతలు, మత గురువులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉంది.