ప్రపంచ నేతల్లో అరుదైన రికార్డ్… యూట్యూబ్‌లో మోదీకి 3 కోట్లకు పైగా ఫ్యాన్స్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.;

Update: 2026-03-03 11:20 GMT

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. తాజాగా ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌లో ఆయన ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచంలోని మరే ఇతర రాజకీయ నేతకు సాధ్యం కాని రీతిలో 3 కోట్ల (30 మిలియన్లు) సబ్‌స్క్రైబర్ల మైలురాయిని మోదీ అధిగమించారు. సోషల్ మీడియాలో తిరుగులేని రారాజుగా నిలిచిన మోదీ డిజిటల్ ప్రయాణంను మనము ఇప్పుడు చూద్దాం..

యూట్యూబ్‌లో మోదీ హవా.. ప్రపంచ నేతల్లో నంబర్ వన్:

ప్రధాని మోదీ సోషల్ మీడియాను ప్రజలతో మమేకమవ్వడానికి ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 3 కోట్లు దాటడం విశేషం.ఇక ఈ ఘనతతో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నాయకుడిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కంటే మోదీ చాలా ముందున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే, మోదీకి ఏకంగా ఏడు రెట్లు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం.

2007 నుంచి సుదీర్ఘ ప్రయాణం.. వేలల్లో వీడియోలు:

మోదీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఉంది. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, అంటే 2007లోనే తన యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆయన సుమారు 33 వేలకు పైగా వీడియోలను ఈ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. ఇక అందులో తన ప్రసంగాలు, విదేశీ పర్యటనలు, సామాన్యులతో ముచ్చట్లు ఇలా ప్రతి అంశాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఈ ఛానల్ కీలక పాత్ర పోషించింది. కేవలం యూట్యూబ్ మాత్రమే కాదు, ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మోదీ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటి రికార్డు సృష్టించింది.

డిజిటల్ ఇండియా.. కనెక్టివిటీనే అసలు సీక్రెట్:

సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. కానీ మోదీ మాత్రం నిరంతరం తన అప్‌డేట్స్‌ను ప్రజలకు అందిస్తూ ఉంటారు. ఇక అందుకే యువతలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. డిజిటల్ ఇండియా నినాదానికి తగ్గట్టుగానే, తనే స్వయంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై పట్టు సాధించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయన షేర్ చేసే వీడియోలకు వచ్చే వ్యూస్, లైక్స్ చూస్తుంటే డిజిటల్ ప్రపంచంలో మోదీని ఢీకొట్టే నేత ప్రస్తుతానికి ఎవరూ లేరని స్పష్టమవుతోంది.

రాజకీయాల్లో గెలవడమే కాదు, ప్రజల మనసు గెలిచి వారి ఫోన్లలో ఒక సబ్‌స్క్రైబర్‌గా చోటు సంపాదించడం అనేది చిన్న విషయం కాదు. 3 కోట్ల సబ్‌స్క్రైబర్ల రికార్డు మోదీ కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగారని నిరూపిస్తోంది. భవిష్యత్తులో ఈ సంఖ్య మరిన్ని రికార్డులను తిరగరాస్తుందనడంలో సందేహం లేదు అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News