`నిద్రలేని రాత్రి`.. సరిహద్దులకు వెళ్లాలని మోడీ యత్నం!
దీనిపై పీఎంవో వర్గాల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ నిద్ర పోలేదు.;
బుధవారం తెలతెల వారుతూనే.. భారత ప్రజలకు షాకింగ్‌తోపాటు అమితమైన ఆనందాన్ని మోసుకు వచ్చిన వార్త `ఆపరేషన్ సిందూర్`. మన దాయాది దేశం పాకిస్థాన్ భూభాగంలో స్థావరాలు ఏర్పాటు చేసు కుని.. భారత్ పై ఉగ్రదాడులకు పాల్పడుతున్నవారి పీచమణచేలా చేసిన ఆపరేషన్ సిందూర్ ఘటన.. యావత్ ప్రపంచాన్ని కూడా.. కదిలించింది. తాజా లెక్కల ప్రకారం 26 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తయ్యిం ది. అయితే.. ఇది ఎలా ఉన్నా.. ప్రధాని మోడీ మంగళవారం ఏం చేశారన్నది ప్రశ్న.
దీనిపై పీఎంవో వర్గాల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ నిద్ర పోలేదు. సాధా రణంగా ఆయన దేశంలో ఉంటే.. రాత్రి 9.30-10 మధ్య నిద్రకు ఉపక్రమిస్తారు. తెల్లవారు జామున 4.30కు లేచి.. ధాన్యం, యోగా వంటివి చేసుకుంటారు. వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొంటారు. తనను కలిసేందుకు వచ్చే వారితో మాట్లాడతారు. ముఖ్యంగా ఆయన గుజరాతీకి చెందిన పలు దినపత్రికలను తిరగేస్తారు. అలానే.. యూపీకి చెందిన పత్రికలను కూడా చదువుతారు.
అయితే.. మంగళవారం రాత్రి మాత్రం మోడీ కునుకు తీయలేదు. పైగా.. రక్షణ శాఖ ఉన్నతాధికారులతో పదే పదే ఫోన్లు చేశారు. ఒకానొక దశలో అర్ధరాత్రి 1.02 నిమిషాలకు ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత.. స్వయంగా తాను కూడా వస్తానని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. దీనికి ఆర్మీ చీఫ్ విస్మయం వ్యక్తం చేశారు. అయితే.. వెంటనే సంబాళించుకున్న ప్రధాని.. ఇది తన మనసులోని అభిలాష అని.. అలా కుదరదని తనకు కూడా తెలుసునని చెప్పారు.
అనంతరం.. ఆయన ఆర్మీ అధికారులు ప్రత్యేకంగా షూట్ చేసిన వీడియోను తానే తొలుత వీక్షించారు. బాహ్య ప్రపంచానికి 1.44 తర్వాత సమాచారాన్ని విడుదల చేశారు. వీడియోలను తెల్లవారు జామున 2.10 గంటలకు విడుదల చేశారు. సో.. మొత్తానికి పక్కాగా మోడీ నిద్రలేని రాత్రిని గడపడంతోపాటు.. సరిహద్దులకు వెళ్లి ఉగ్రమూకలపై దాడిని ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకున్న విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు.