• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఘటనా స్థలాన్ని...

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని... మృత్యుంజయుడికి పరామర్శ!

| విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి మోడీ.. శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు.

By - Tupaki Desk
Update: 2025-06-13 05:45 GMT

అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది మృతి చెందారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ అహ్మదాబాద్ చేరుకున్నారు.

అవును... విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి మోడీ.. శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘటనాస్థలానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ప్రధానితోపాటు మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి చేరుకున్నారు ప్రధాని. ఈ సందర్భంగా ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైన విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను ఆయన పరామర్శించారు. ఇదే సమయంలో ఈ విమాన ప్రమాదంలో గాయపడిన ఇతర మెడికోలతోనూ మోడీ మాట్లాడి ధైర్యం చెప్పారు.

కాగా... గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు పనిచేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ విషాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకం అని.. ఈ విచారకర సమయంలో తన ఆలోచనలు ఈ ప్రకాదం బారిన పడిన ప్రతీ ఒక్కరితోనూ ఉంటాయని తెలిపారు.

మరోవైపు ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ కూడా ప్రమదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం.. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Visited the crash site in Ahmedabad today. The scene of devastation is saddening. Met officials and teams working tirelessly in the aftermath. Our thoughts remain with those who lost their loved ones in this unimaginable tragedy. pic.twitter.com/R7PPGGo6Lj

— Narendra Modi (@narendramodi) June 13, 2025

Modi ji met the lone survivor of the Air India #planecrash pic.twitter.com/GMoGMwxOXW

— Aryan (@chinchat09) June 13, 2025
Tags:    
  • AirIndiaCrash 
  • AhmedabadTragedy 
  • PMModi 
  • VishwashKumar 
  • PlaneCrashSurvivor 
  • IndiaNews 
  • ModiVisit 
  • NarendraModi 
  • AviationDisaster 
  • AhmedabadCrash 

Similar News

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

Copyright @2026

Powered by Blink CMS