ఆన్‌లైన్‌లో ఫిజిక్స్ పాఠాలు చెప్పి తోపు షారూఖ్‌నే వెనక్కి నెట్టాడు!
కింగ్ ఖాన్ షారూఖ్ భారతదేశంలోని రిచెస్ట్ సూపర్ స్టార్ గా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.;
కింగ్ ఖాన్ షారూఖ్ భారతదేశంలోని రిచెస్ట్ సూపర్ స్టార్ గా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు, రకరకాల వ్యాపార మార్గాల ద్వారా వేల కోట్ల సామ్రాజ్యాన్ని అతడు విస్తరించాడు. భారతదేశ వినోద పరిశ్రమల నుంచి తొలి బిలియనీర్ గాను చరిత్రకెక్కాడు. షారూఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ సుమారు 12,490కోట్లుగా ఉందని హురూన్ లిస్ట్ 2025 ప్రకటించింది.
అయితే కింగ్ ఖాన్ షారూఖ్ ని మించి ఒక ఫిజిక్స్ భోధకుడు (టీచర్) సంపాదిస్తున్నాడనే నిజం తెలిస్తే, ఆశ్చర్యం కలగకుండా ఉండదు. అతడు ఆన్ లైన్‌లో పాఠాలు నేర్పిస్తూ, ఈ రోజు ఎడ్ టెక్ కంపెనీని 14,510 కోట్ల నికర ఆస్తులున్న సంస్థగా మలిచాడంటే ఆ వ్యక్తి ఎంత పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగాడో అర్థం చేసుకోవచ్చు. అతడు హురూన్ జాబితాలో ప్రముఖ వ్యవస్థాపకుడిగా రికార్డులకెక్కాడు. ఇదంతా ఎడ్‌టెక్ ``యునికార్న్ ఫిజిక్స్ వాల్లా`` వ్యవస్థాపకుడు అలఖ్ పాండే గురించిన స్టోరి. అతడి సంపదలు ఈ రోజు రూ.14,510 కోట్లకు చేరుకున్నాయి.
ఫిజిక్స్ వల్ల ఆదాయం గత ఏడాది అత్యంత వేగంగా పెరిగింది. కంపెనీ నికర నష్టాలను భారీగా తగ్గించడంతో పాటు, ఆదాయం రూ.1,940 కోట్ల నుండి రూ.2,886 కోట్లకు పెంచడానికి అతడు చాలా హార్డ్ వర్క్ చేసాడు. ఫిజిక్స్ వాల్లా రూ. 3,820కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపివో) కోసం సెబీకి ధరఖాస్తు చేసుకున్నాడు. ఈ ఆఫర్‌లో రూ. 3,100 కోట్ల తాజా ఇష్యూ - రూ. 720 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ ఉంది. ప్రమోటర్లు అలఖ్ పాండే - ప్రతీక్ మహేశ్వరి సేల్ ద్వారా రూ. 360 కోట్ల విలువైన షేర్లను విక్రయించాలని యోచిస్తున్నారు.
హార్వార్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీలో స్టడీ పూర్తి చేసిన తర్వాత అలఖ్ పాండే 2016లో యూట్యూబ్‌లో టీచింగ్ ప్రారంభించారు. నేడు అతడు భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థాపకులలో ఒకరిగా ఎదిగారు. ఒక ఆన్ లైన్ విద్యా సంస్థ నుంచి బిలియన్ డాలర్ల ఎడ్‌టెక్ కంపెనీ వ్యవస్థాపకుడిగా పాండే ఎదిగిన కథ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రతిభ, గొప్ప విజ్ఞానం, పట్టుదలను అతడి ప్రయాణం ఆవిష్కరిస్తోంది.