• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వంగవీటి రాధ వివాహ వేడుకలో...

వంగవీటి రాధ వివాహ వేడుకలో పవన్, కొడాలి నాని సందడి... పిక్స్ వైరల్!

| ఇందులో భాగంగా... "విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

By - Tupaki Desk
Update: 2023-10-23 05:51 GMT

దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ – పుష్పవల్లిల వివాహ వేడుక ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. కృష్ణాజిల్లా పోరంకిలోని "ఎం రిసార్ట్స్" లో జరిగిన ఈ వివాహ వేడుకకు భారీ సంఖ్యలో బందువులు, స్నేహితులు, అభిమానులు, రాజకీయ నాయకులూ, ప్రముఖులూ తరలివచ్చి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

అవును.. వంగవీటి రాధాకృష్ణ - పుష్పవల్లి ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, బీఆరెస్స్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను జనసేన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఇందులో భాగంగా... "విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. విజయవాడలోని పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌ లో జరిగిన ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. నూతన వధూవరులు వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిలకు శుభాకాంక్షలు తెలిపారని" ట్విటర్‌ లో తెలిపారు.

వధువు పుష్పవల్లి తండ్రి నర్సాపురంలో జనసేన నేతగా ఉన్నారు. పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర వేళ వారి ఇంట్లోనే బస చేసారు! వంగవీటి రాధా వివాహ ఖరారు విషయంలోనూ టీడీపీ, జనసేన స్థానిక నేతలు మధ్యవర్తిత్వం వ్యవహరించారని చెబుతున్నారు! వీరి నిశ్చితార్థం ఆగస్టులో జరిగింది. ఈ సమయంలో ఈ వివాహ వేడుకలో పవన్ పాల్గొన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదే సమయంలో... ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, కొలుసు పార్థసారథి, గద్దె రామ్మోహన్‌, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, జలీల్‌ ఖాన్‌, యార్లగడ్డ వెంకట్రావు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

వంగవీటి రాధాకృష్ణ 2004 లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత పలుసార్లు పోటీ చేసినప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టలేక పోయారు. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్రలో కనిపించారు. చినబాబుతో కలిసి కాసేపు నడిచారు. ఆ సంగతి అలాఉంటే... త్వరలో వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఆదివారం రాత్రి విజయవాడ, పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో జరిగిన ఈ వేడుకకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ… pic.twitter.com/exEcAqKEUr

— JanaSena Party (@JanaSenaParty) October 22, 2023
Tags:    
  • Janasenaparty 
  • Pawankalyan 
  • Brssparty 
  • Nadendlamanohar 
  • Thotachandrasekhar 
  • Vangaveetimohanaranga 
  • Radhakrishna 
  • Pushpavalli 
  • Mresorts 
  • Keshineninani 
  • Kodalinani 
  • Vallabhanenivamsi 
  • Kolusuparthasarathy 
  • Gadderammohan 
  • Buragaddavedavyas 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS