జగన్ని తక్కువ అంచనా వేయవద్దు... పవన్ సంచలన కామెంట్స్ !

జనసేన అయితే ఎవరితో గొడవలు పెట్టుకోదని అన్నారు. ఇక జగన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.;

Update: 2023-10-02 16:42 GMT
జగన్ని తక్కువ అంచనా వేయవద్దు... పవన్ సంచలన కామెంట్స్ !

ఏపీలో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అంటూనే జగన్ని తక్కువ అంచనా వేయవద్దని జనసేనాని పవన్ కళ్యాణ్ క్యాడర్ కి సూచించారు. మనలో మనం కొట్టుకుంటే మళ్లీ జగనే వస్తాడని ఆయన హెచ్చరించారు. ప్రజారాజ్యం పార్టీని కూడా దెబ్బ తీసింది సొంత పార్టీ వారే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందువల్ల ప్రత్యర్ధులు ఎటూ ఓడించాలని చూస్తారు. కానీ పార్టీలో కలహించుకుంటే ఇబ్బంది అవుతుంది. మనలో మనం కొట్టుకుంటే జగనే మళ్లీ వచ్చి ప్రజల రక్తం తాగేస్తారు అని ఆయన హెచ్చరించారు. కేసులు పెట్టేసి మరీ హింసిస్తారు అని ఆయన అన్నారు.

అందువల్ల పార్టీ కోసం అంతా పనిచేయాలని జనసేనాని కోరారు. తెలుగుదేశం జనసేన పొత్తులు ప్రజలు కోరుకున్నదని ఆయన అన్నారు. పొరపొచ్చాలు వద్దని ఆయన అన్నారు. గౌరవప్రదమైన పొత్తుకే తాను ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో జనసేన మద్దతుదారులు బాధపడాల్సింది లేదని అన్నారు.

జగన్ విషయంలో తక్కువగా ఆలోచిస్తే చాలా ఇబ్బందులు వస్తాయని అన్నారు. తెలుగుదేశంతో కలసినా అమీ తుమీ యుద్ధమే వస్తుందని అన్నారు. మనలో మనం గొడవలు పెట్టుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయని అన్నారు.

జనసేన అయితే ఎవరితో గొడవలు పెట్టుకోదని అన్నారు. ఇక జగన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. 26 లక్షల దొంగ ఓట్లు వారి దగ్గర ఉన్నాయని అన్నారు. టీడీపీ జనసేన పొత్తులో పవన్ సీఎం అవుతారు అన్నది మన గెలుపు సామర్ధ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని అన్నారు.

తెలుగుదేశాన్ని తక్కువ వేయవద్దు అన్నారు. మిత్రపక్షాన్ని బలహీనంగా ఉన్నారు అని అనుకోవద్దు. వారికి రావాల్సిన ఓటు షేర్ వారికి ఉంటుంది, వారి అనుభవం వారికి ఉందని అన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేత అక్కడ ఉన్నారు అన్నది కూడా చూడాలని అన్నారు.

ఏది ఏమైనా వచ్చే ఎన్నికలు సామాన్యమైనవి కావని ఈ రోజు నుంచే కష్టపడాలని అన్నారు. తాను ఎపుడూ పదవుల కోశం ఆశించేవాడిని కానని అన్నారు. అలాగని అధికారం వస్తే తీసుకోకుండా ఉండమని అన్నారు. దశాబ్ద కాలం పాటు జనసేన నలిగిందని ప్రజా సమస్యల మీద పోరాడిందని ఆయన గుర్తు చేశారు.

తాను పదవులను ఆశించి పొత్తులు పెట్టుకోనని రాష్ట్ర భవిష్యత్తుని చూసి పొత్తు పెట్టుకుంటానని అన్నారు. టీడీపీ జనసేన రెండూ ఒక్కటిగా ఉంటే అధికారం దక్కడం తధ్యమని అన్నారు. ఆరు నెలలు ఆగితే మనదే అధికారం అని అన్నారు. ఇక వైసీపీ ఓడిపోయే పార్టీ కనుకనే వారి మీద ఎక్కువ విమర్శలు చేయడం లేదని అన్నారు. వారు కొండ అంచులలో ఉన్నారని కిందకు జారిపడబోతున్నారని ఆయన సెటైర్లు వేశారు. మొత్తానికి జనసేన టీడీపీ ఒక్కటిగా ఉండాలని పదవుల కంటే రాష్ట్రం ముఖ్యమని పవన్ దిశా నిర్దేశం చేశారు.

Tags:    

Similar News