షాకింగ్ పిక్... సెలైన్ డ్రిప్ తో పవన్ కల్యాణ్!
ఈ సమయంలో నిన్న ఆరోగ్యం సహకరించకపోవడంతో కేబినెట్ మీటింగ్ నుంచి వెళ్లిపోయిన పవన్.. నేడు సచివాలయంలో కనిపించారు.;
మంగళవారం రాష్ట్ర సెక్రటేరియట్ లో జరిగిన కేబినెట్ మీటింగ్ కు హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆరోగ్యం సహకరించకపోవడంతో తిరిగి క్యాంప్ ఆఫీసుకు వెళ్లినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ ఆరోగ్యానికి ఏమైంది? అనే చర్చ బలంగా నడిచింది. ఈ క్రమంలో చేతికి సెలైన్ డ్రిప్ తో కనిపించారు పవన్ కల్యాణ్.
అవును... పవన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జ్వరంతోపాటు స్పాండిలైటిస్ తో కూడా బాధపడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నారనే ఆందోళనలు అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి! ఈ సమయంలో నిన్న ఆరోగ్యం సహకరించకపోవడంతో కేబినెట్ మీటింగ్ నుంచి వెళ్లిపోయిన పవన్.. నేడు సచివాలయంలో కనిపించారు.
ఈ రోజు సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో ఏపీ మంత్రివర్గం కీలకమైన సమావేశంలో పాల్గొంది. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. చేతికి సెలైన్ డ్రిప్ తగిలించుకుని కనిపించడం గమనార్హం.
అంటే.. పవన్ నిన్నటి నుంచి వైద్యం చేయించుకుంటూ.. నేడు అతిముఖ్యమైన సమావేశం కావడంతో అనారోగ్యంగా ఉన్నప్పటికీ, చేతికి సెలైన్ డ్రిప్ తో హాజరయ్యారన్నమాట! దీంతో... దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేయడం మొదలుపెట్టాయి. ఇది పవన్ కల్యాణ్ కమిట్ మెంట్ కి తాజా ఉదాహరణ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!
మరోపక్క ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 16వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో అమరావతి రాజధానిపై స్పెషల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా... రాష్ట్ర విభజన వల్ల కలిగిన నష్టం, కేంద్ర సాయం అవసరాన్ని చంద్రబాబు వివరించారు.