ఊరుకునే ప్రసక్తే లేదు... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్

ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అసలు సహించేది లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. అటవీ భూములను ఆక్రమించుకోవాలని చూస్తే కనుక సీరియస్ గానే వ్యవహరిస్తామని ఆయన అంటున్నారు.;

Update: 2025-10-25 00:47 GMT

ఇక రాజీ పడేది లేదు, చూస్తూ ఊరుకునేది అంతకంటే లేదు, అన్నీ పక్కాగా ఉంటాయి, ఎవరైనా ఎంతటి వారు అయినా అసలు ఉపేక్షించే ప్రశ్నే లేదని అటవీ శాఖ మంత్రి హోదాలో పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అసలు సహించేది లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. అటవీ భూములను ఆక్రమించుకోవాలని చూస్తే కనుక సీరియస్ గానే వ్యవహరిస్తామని ఆయన అంటున్నారు.

ఆదాయ శాఖగా :

అటవీ శాఖను ఆదాయ శాఖగా మార్చాలని ఆయన అధికారులకు సూచించారు. జాతీయ సంపద అంతా అడవులలోనే ఉందని అన్నారు. అడవులను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఏంతైనా ఉందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ రోజు కాదు రేపటి తరం గురించి దృష్టిలో ఉంచుకుని కార్యాచరణను సిద్ధం చేయాలని అన్నారు

రాజకీయాలు లేవంతే :

అటవీ భూములను కాపాడే విషయంలో రాజకీయాలకు అసలు తావు లేదని ఆయన అన్నారు. అదే సమయంలో రాజీ పడేది ఉండదని అన్నారు. అడవుల పరిరక్షణ కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని దానిని అధికారులు గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారు. అడవులు అంటే కబ్జాలు అన్న మాట వినిపించరాదని అన్నారు. ప్రతీ అంగుళమూ అమూల్యం అని చెప్పిన పవన్ అటవీ భూములను కాపాడే విషయంలో అధికారులు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగాలని కోరారు.

మంత్రే ఆక్రమించారు :

ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వం గురించి విమర్శలు చేశారు. గత వైసీపీ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఒకాయన ఏకంగా తన సొంత ఇలాకాలోనే అటవీ భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్నారని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి ఆనాడు అధికారులు ఏమి చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించలేదో అర్ధం కాదని అన్నారు. ఆ తరహా దారుణాలు పొరపాట్లు కూటమి ప్రభుత్వంలో అయితే అసలు జరగడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేసారు. ఒక్క అంగుళం స్థలం కబ్జా అయినా అధికారులదే బాధ్యత అన్నారు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో తాను ఎక్కడా రాజీ పడను అన్నారు. అటవీ సిబ్బంది కొరత విషయాన్ని తాను గమనంలోకి తీసుకున్నాను అని పవన్ చెబుతూ తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News