గో మాంసం అక్రమ రవాణా .... పవన్ ఉగ్ర రూపం
ఏపీలో కొన్ని కీలక సమస్యల మీద జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతూ ఉంటారు.;
ఏపీలో కొన్ని కీలక సమస్యల మీద జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ మధ్యన భీమవరంలో పేకాట క్లబ్ ల విషయంలో ఆయన ఏకంగా పోలీసు ఉన్నతాధికారులనే వివరాలు కావాలని ఆదేశించారు. ఇపుడు మరో సీరియస్ ఇష్యూ మీద పవన్ ఏకంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ నే వివరాలు అడిగి తెల్సుకున్నారు. అంతే కాదు వాటి మూలాలు గుర్తించండి అంటూ ఆదేశాలు జారీ చేశారు.
గో మాంసం అక్రమ నిల్వలు
గత కొన్ని రోజులుగా విశాఖలో గో మాంసం అక్రమ నిల్వల విషయం మీద వార్తలు వస్తున్నాయి. దీని వెనక ఎవరిదో హస్తం ఉందని వారిని పట్టుకోవాలని విపక్షాల నుంచి కూడా డిమాండ్ వస్తోంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ విశాఖ పోలీస్ క కమిషనర్ నే ఈ విషయంలో ఆరా తీసి ఎవరున్నారో కనుక్కోవాలని కోరారు. అంతే కాదు పూర్తిగా విచారణ చేయాలని ఆదేశించారు.
వైరల్ అయిన వైనం :
తాజాగా విశాఖలో గో మాంసం నిల్వలతో పాటు అక్రమ రవాణా అన్న విషయం సీరియస్ టాపిక్ అయింది. అంతే కాదు ఏపీలో బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉంది. మరి గో మాంసం అన్నా గో వధ అన్నా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాంటి ప్రభుత్వంలో ఇలాంటి ఘాతుకాలా అన్న విమర్శలు కూడా విపక్షాల నుంచి వస్తున్నాయి. దాంతో ఈ ఇష్యూని టేకప్ చేశారు. అందుకే ఆయన ఈ విషయం వెనుక ఎవరున్నా ఉపేక్షించవద్దని కోరడం జరిగింది అని అంటున్నారు. దాని కంటే ముందుగా ఆయన విశాఖలో భారీగా గో మాంసం నిల్వలు పట్టుబడిన వ్యవహారంపై పూర్తి సమాచారం తెలుసుకున్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ నుంచి కేసుకు సంబంధించిన వివరాలను అన్నీ కనుగొన్నారు. అంత పెద్ద ఎత్తున గో మాంసం ఒకే చోట ఎలా నిల్వ చేయగలిగారు అసలు వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు అలా నిల్వ ఉంచిన మాంసాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు అసలు ఈ మొత్తం వ్యవహారం దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దాని మీద పవన్ కళ్యాణ్ పోలీసు అధికారుల నుండి వివరాలు అన్నీ సేకరించారు.
పెద్ద మొత్తంలోనే :
ఇదిలా ఉంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మిత్ర కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన 1.89 లక్షల కేజీల గో మాంసాన్ని పట్టుకుని ఆ కేసును పోలీస్ శాఖకు అప్పగించినట్టు కమిషనర్ పవన్ కళ్యాణ్ కి తెలిపారు. డి.ఆర్.ఐ అధికారులు దాడులు జరిపిన సందర్భంలో అక్కడ ఉన్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా చెప్పారు. అదే విధంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం మాంసం ఎక్కడి నుంచి వచ్చింది అక్రమ రవాణా నెట్ వర్క్ ఎంత మేర విస్తరించి ఉంది అనుమతుల ఉల్లంఘనలు తదితర అంశాలపై విచారణ కొనసాగుతున్నట్టు కమిషనర్ తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద సీరియస్ గా ఫోకస్ చేయడమే కాదు బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని పట్టుదలను ప్రదర్శించడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారని అంటున్నారు.